Share News

kumaram bheem asifabad- ప్రత్యేక పూజలు.. అన్నదానాలు..

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:14 PM

వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆయా గణేష్‌ మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదానాలు నిర్వహించారు. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ నితికా పంత్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి బోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అలాగే గాంధీచౌక్‌, శ్రీ సరస్వతి శిశు మందిర్‌, సందీప్‌నగర్‌ శివాలయం, జన్కాపూర్‌ అలయం గణేష్‌ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

kumaram bheem asifabad- ప్రత్యేక పూజలు.. అన్నదానాలు..
పోలీసు సిబ్బందికి భోజనం వడ్డిస్తున్న ఎస్పీ నితికాపంత్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆయా గణేష్‌ మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదానాలు నిర్వహించారు. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ నితికా పంత్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి బోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అలాగే గాంధీచౌక్‌, శ్రీ సరస్వతి శిశు మందిర్‌, సందీప్‌నగర్‌ శివాలయం, జన్కాపూర్‌ అలయం గణేష్‌ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, మున్సిపల్‌ కమీషనర్‌ అంజయ్య, కౌన్సిలర్లు వినోద్‌, కార్తీక్‌, బాలకృష్ణ, కార్యక్రమంలో ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌, ఐటీకోర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవిందర్‌, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజు, ఆర్‌ఐలు వామనమూర్తి, అంజన్న, శ్రీనివాస్‌, ఆర్‌ఎస్‌ఐ లవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండలంలోని బీబ్రాలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొలువు తీరిన గణనాథుడిని శుక్రవారం ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీని ఆలయ కమిటి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు భీమన్న, నాయకులు ఎల్కమోహన్‌, స్వప్న, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, యూత్‌ అద్యక్షులు సాయి, ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని శివాలయ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ క్యాక్రమంలో శివాలయ గణేష్‌ మండలి సభ్యులు ఇటన్‌కార్‌ ప్రవీణ్‌, గణేష్‌, జస్వంత్‌, శ్రీకాంత్‌, శంకర్‌, శేఖర్‌, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 11:14 PM