kumaram bheem asifabad- దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Sep 18 , 2026 | 11:10 PM
జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో ప్రపంచ చెవిటి దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా న్యాయసేవా ప్రాదికారసంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం దివ్యాంగులకు న్యాయపరమైన సేవలు, చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా న్యాయసేవా ప్రాదికార సంస్థ కార్యదర్శి అనూష, అదనపు కలెక్టర్ డేవిడ్‌లతో కలిసి హాజరయ్యారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో ప్రపంచ చెవిటి దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా న్యాయసేవా ప్రాదికారసంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం దివ్యాంగులకు న్యాయపరమైన సేవలు, చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా న్యాయసేవా ప్రాదికార సంస్థ కార్యదర్శి అనూష, అదనపు కలెక్టర్ డేవిడ్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని దివ్యాంగుల నిర్థారణ శిబిరాలను జిల్లా ఆసుపత్రిలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దివ్యాంగుల సమస్యలను సంబందితశాఖల అధికారులతో సమీక్షించి పరిక్షరించే విధంగా కృషిచేస్తామని చెప్పారు. జిల్లా న్యాయసేవా ప్రాదికార సంస్థ కార్యదర్శి అనూష మాట్లాడుతూ దివ్యాంగులు న్యాయసేవలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండలన్నారు. దివ్యాంగుల కౌసల్ వికాస్, దివ్యాంగుల రోజ్‌గార్ సేతులో భాగంగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ తెగలు మానవ అక్రమ రవాణా బాదితులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నిస్తాహాయులైన పిల్లలు, లైంగిక వేధింపుల బాధిత పిల్లలకు న్యాయపరంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా న్యాయసేవ ప్రాదికార సంస్థ న్యాయవాదిని నియమించి న్యాయస్థానాలలో ఉచితంగా న్యాయసేవలు అందించడం జరుగుతుందని వివరించారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారిణి స్వరూపరాణి, డీఈవో సచ్చిదానందచారి, డీపీఎం రామకృష్ణ సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
నైపుణ్యం పెంపొందించుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):ప్రస్తుత అవసరాలకు పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుని మేదరులు ఆర్థిక అభివృద్ధి సాధించాలని కలెక్టర్ కె హరిత సూచించారు. బీసీ సంక్షేమశాఖ అధికారి నదీం అధ్యక్షతన కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించిన ప్రపంచ వెదురు దినోత్సవానికి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌లతో కలిసి హారయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెదురుతో తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ అవకాశాలను కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మేదరుల జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అటవీ ప్రాంతం నుండి వెదురు తీసుకువచ్చేలా అటవీశాఖ అధికారులతో మాట్లాడతానని చెప్పారు. కానీ దీనికి ప్రత్యామ్నయంగా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఇస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని వెదురు పంటను రెవెన్యూ భూముల్లో వేసుకునేలా చుడాలన్నారు. పల్లెప్రకృతి వనాలలో వెదురు పెంచేలా చర్యలు తీసుకొవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. దహెగాం, బెజ్జూరు మండలాల్లో కొంతమంది మేదరులకు ఇళ్లు లేక గుడిసెలలో ఉంటున్నారని నాయకులు దృష్టికి తీసుకు వచ్చారు. గుడిసెలలో ఉన్న ప్రలఅ ఒక్కరికి ఇండ్లు మంజూరు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. ఈ సందర్భంగా మేదరులు అల్లిన అల్లికలను జిల్లా కలెక్టర్ పరిశీలించి వారి నైపుణ్యాన్ని అభినందించారు. డిసెంబరు 6న కౌటాలలో నిర్వహించే కంకాలమ్మ జాతర పోస్టర్లను అవిష్కరించారు. మేదరుల సంఘం అధ్యక్షుడు సులువ కనకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపాల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి దీకొండ సత్యనారయణ, నాయకులు చింత అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.