kumaram bheem asifabad- విద్యార్థులకు స్పెషల్ కిట్లు
ABN , Publish Date - Apr 14 , 2026 | 10:35 PM
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సమానత్వ భావం పెంపొందించేందుకు వచ్చే విద్యా సంవత్స రం నుంచి ‘ఒకే రాష్ట్రం-ఒకే యూనిఫాం’ విధానం అమలు చేయనున్నారు. ఈ విధానం విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు ఓ బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకు రానుందని ప్రభు త్వం భావిస్తోంది.
- 21 వస్తువులతో విద్యార్థులకు అందజేసేలా చర్యలు
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ఏర్పాట్లు
- జిల్లాలో 93,748 మంది విద్యార్థులకు ప్రయోజనం
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సమానత్వ భావం పెంపొందించేందుకు వచ్చే విద్యా సంవత్స రం నుంచి ‘ఒకే రాష్ట్రం-ఒకే యూనిఫాం’ విధానం అమలు చేయనున్నారు. ఈ విధానం విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు ఓ బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకు రానుందని ప్రభు త్వం భావిస్తోంది. ఇప్పటి వరకు విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాం మాత్రమే పంపిణీ చేస్తూ వచ్చిన ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి 21 వస్తువులు కలిగిన స్పెషల్ స్కూల్ కిట్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 45వేల మందికి పైగా పేద, మధ్య తరగతి విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలైనా ఒక్కోచోట ఒకలాగా వేర్వేరు రంగులు, డిజైన్ కలిగిన యూనిఫాం అ మలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే రంగు, ఒకే డిజైన్ ఉన్న యూనిఫాం అమలు చేయనున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవా త్మకమైన మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి కార్పోరేట్ స్థాయి పాఠశాలలకు ఏ మాత్రం తీసుపోకుండా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
జిల్లా వ్యాప్తంగా ఇలా..
జిల్లాలో మొత్తం 1,268 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 908 ప్రాథమిక, 191 ప్రాథమి కోన్నత, 169 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో మొత్తం 93,748 మంది విద్యార్థులుండగా 46,120 మంది బా లురు, 47,628 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠ శాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రేక్ ఫాస్ట్ కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసు కుంటోంది. పేదరికం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతుల ప్రభావం విద్యార్థుల చదువులపై పడ కుండా ఉండేందుకు సదుపాయాలు మెరుగు పరచ డంపై దృష్టి సారించింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుం బ సమస్యలతో విద్యార్థులు తమ చదువులను మధ్య లోనే నిలిపివేయకుండా బ్రేక్‌ఫాస్ట్ సదుపాయం కల్పించడంతో పాటు 21 వస్తువుల స్పెషల్ కిట్ వి ద్యార్థులకు అందజేయాలని సర్కార్ నిర్ణయించింది.
- చదువులకు అవసరమైన..
విద్యార్థుల చదువులకు అవసరమైన నోట్ పుస్తకా లు, యూనిఫాం, బ్యాగ్ ఇతర సామగ్రి కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం 21 వస్తువులతో కూడిన స్కూల్ కిట్‌ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కిట్‌లో మూడు జతల యూనిఫాం క్లాత్, షూ, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, నోట్‌బుక్స్, టెక్స్ట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఏరేజర్, షార్ప్‌నర్, జామెట్రీ బాక్స్, డిక్షనరీ తదితర వస్తువులు ఉండనున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు ఈ కిట్లు అందుబాటులో ఉంచాలని ప్ర భుత్వం సంబందిత అధికారులను ఆదేశించింది.