విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:01 AM
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యనభ్యసించే విద్యార్థి, విద్యార్థునుల ఆరోగ్యంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని లేదంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి రూరల్,ఫిభ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యనభ్యసించే విద్యార్థి, విద్యార్థునుల ఆరోగ్యంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని లేదంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం బెల్లంపల్లి సంక్షేమ వసతి గృహంలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న 16మంది విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాల ఆవరణ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన అహారం అందించాలన్నారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వసతిగృహ సంక్షేమాధికారి సుజతకు షోకాజు నోటీసులు అందించినట్లు, విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్, ఎస్టీ, ఎస్టీ శాఖ అధికారి దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.