Special Trains: సంక్రాంతికి 27 రైళ్లకు స్పెషల్ హాల్ట్‌లు!
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:53 AM
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర ప్రయాణికులకు దక్షిణమధ్యరైల్వే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది.
హైదరాబాద్ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర ప్రయాణికులకు దక్షిణమధ్యరైల్వే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్‌లో, సికింద్రాబాద్- విజయవాడ మార్గంలో నడిచే మరో 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లిలో ప్రత్యేక హాల్ట్‌లను ఏర్పాటు చేసింది. ఈ సదుపాయం ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
హైటెక్‌సిటీలో ఆగే 16 రైళ్లు ఇవీ..
హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌లో ఆగనున్న రైళ్లలో మచిలీపట్నం- బీదర్ ఎక్స్‌ప్రెస్, నర్సపూర్- లింగంపల్లి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి, కాకినాడ టౌన్- లింగంపల్లి గౌతమి, సాయినగర్- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, సాయినగర్- కాకినాడ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం- సాయినగర్, కాకినాడ- సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- కాకినాడ టౌన్ కాకినాడ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- లింగంపల్లి జన్మభూమి, ముంబై- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి- నర్సాపుర్ ఎక్స్‌ప్రెస్, బీదర్- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
చర్లపల్లిలో ఆగే 11 రైళ్లు
సికింద్రాబాద్- గూడూరు- సికింద్రాబాద్ సింహపురి, కాకినాడ- లింగంపల్లి- కాకినాడ గౌతమి, కాకినాడ- లింగంపల్లి- కాకినాడ కాకినాడ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ గరీబ్‌రథ్, సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ, హైదరాబాద్- విశాఖపట్నం గోదావరి, తిరుపతి- సికింద్రాబాద్- తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రె్‌సలు బుధవారం నుంచి 20 వరకు చర్లపల్లి స్టేషన్‌లో ఆగనున్నాయి.
రైల్‌వన్ యాప్ ద్వారా రైల్వేశాఖ ప్రత్యేక డిస్కౌంట్
ప్రయాణికులకు రైల్వేశాఖ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రైల్‌వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్ల కొనుగోళ్లపై 3 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ జనవరి 14 నుంచి జూలై 14 వరకు అమల్లో ఉంటుందని దక్షిణమధ్యరైల్వే అధికారులు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా రిజర్వుడు, అన్‌రిజర్వుడు ప్రయాణ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లు పొందవచ్చన్నారు.