Share News

kumaram bheem asifabad- ప్రయోగాలకు ప్రత్యేక నిధులు

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:08 PM

ఇంటర్‌ విద్యా ర్థులకు ప్రయోగ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేయించేందుకు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల చేసింది.

kumaram bheem asifabad- ప్రయోగాలకు ప్రత్యేక నిధులు
బెజ్జూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

- ఒక్కో కళాశాలకు రూ. 50 వేల చొప్పున మంజూరు

బెజ్జూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యా ర్థులకు ప్రయోగ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేయించేందుకు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల చేసింది. ఒక్కో కళాశాలకు రూ.50వేల చొప్పున కళాశాల ప్రిన్సిపల్‌ ఖాతాలో జమ చేసింది. జిల్లా ఇంటర్‌ విద్యాధికారుల పర్యవేక్షణలో కలెక్టర్‌ అనుమతితో కళాశాలకు అవసరమైన రసాయ నాలు, పరికరాలు కొనుగోలు చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.

- మూడు విడతల్లో పరీక్షలు..

గతేడాది ఒక్కో కళాశాలకు రూ.25వేల చొప్పున మంజూరు చేశారు. ఈ ఏడాది దాన్ని రూ.50వేలకు పెం చారు. వారం రోజుల్లో పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 2నుంచి మూడు విడతల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి బ్యాచ్‌కు 25మంది విద్యార్థుల చొప్పున ఐదు రోజుల పాటు నిర్వహించను న్నారు. ఈ ఏడాది నిఘా నీడలో ప్రయోగాలు నిర్వహిస్తున్నందున సీసీ కెమెరాలున్న కళాశాలలకు మాత్రమే ప్రయోగ పరీక్ష కేంద్రం కేటాయించారు. లేని కళాశాలల విద్యార్థులు సమీపం లోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు.

- గదుల కొరత సమస్య..

అవసరమైన సామగ్రికి నిధులు వచ్చినా ప్రభుత్వ కళాశాలల్లో ప్రయోగశాలలే సమస్యగా మారనున్నా యి. జిల్లాలో మొత్తం 11ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా, జిల్లాలో కొన్నిచోట్ల గదుల సమస్య వెంటాడు తోంది. దీంతో ఆయా కళాశాలల్లో తరగతి గదుల్లోనే వాటిని నిర్వహిస్తుండగా, మరికొన్నింటిలో వాటి నిర్వహణ కొరవడి అధ్వానంగా మారింది. తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నా ప్రయో గాలు చేసుకునే అనువైన వాతావరణం ఉండటం లేదు. జిల్లాలో పలుచోట్ల గతంలో నిర్మించిన భవ నాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అవస్థల మద్య గదుల్లోనే ప్రయోగ గదులు ఏర్పాటు చేశారు.

సద్వినియోగం చేసుకోవాలి..

- రాందాస్‌, డీఐఈవో, ఆసిఫాబాద్‌

అవసరమైన పరికరాలు, రసాయనాలు త్వరలోనే కొనుగోలు చేసి ప్రయోగశాలలను అందుబాటులో ఉంచుతాం. విద్యార్థులు నిత్యం కళాశాలకు హాజరై ప్రయోగ విద్యను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా 11కళాశాలలకు గాను ఒక్కో దానికి రూ.50 వేల చొప్పున ప్రయోగాలకు నిధులు మంజూరయ్యా యి. ప్రయోగ పరీక్షలు కూడా సీసీ కెమెరాల నిఘాలో కొనసాగుతాయి. ఈ మేరకు చర్యలు తీసుకుంటు న్నాం.

Updated Date - Jan 09 , 2026 | 11:08 PM