Share News

ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - May 30 , 2026 | 11:27 PM

పెండింగ్‌ కేసులు నిందితుల అరెస్టులు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ ఝా అన్నా రు. కమిషనరేట్‌ కార్యాలయంలో రామగుండం, మంచిర్యాల జోన్‌ పరిధిలో ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి

రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా

మంచిర్యాలక్రైం, మే30 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ కేసులు నిందితుల అరెస్టులు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ ఝా అన్నా రు. కమిషనరేట్‌ కార్యాలయంలో రామగుండం, మంచిర్యాల జోన్‌ పరిధిలో ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమోదవు తున్న కేసుల దర్యాప్తులో ఎలాంటి రాజీపడకుండా పారదర్శకత నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాల న్నారు. దీర్గకాలికంగా పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచిం చారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ, అరస్టులు సాక్షాల కేసుల్లో ఎలాం టి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఆర్థిక నేరాల కేసులో చట్టప్రకారం నిందితులకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసే చర్యలను తీసుకోవాలన్నారు కిడ్నాప్‌, మిస్సింగ్‌ కేసుల్లో బాధితులను గుర్తిం చడంలో జాప్యం చేపట్టరాదన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాకలాపాల్లో భాగంగా అక్రమ ఇసుక ర వాణ, గుడుంబ తయారీ, పేకాట చట్టవిరుద్ద కార్యాకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోపించారు. గుట్కా విక్రయాలు, రేషన్‌ బియ్యం అక్రమ రవాణను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణ ప్రాంతాల్లో హెల్మెంట్‌ లేకుండా అనుమతి ఇవ్వద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, అదనపు డీసీపీ అడ్మిన్‌ కే. శ్రీనివాస్‌, ఏసీపీలు రమేశ్‌, ఆర్‌. ప్రకాశ్‌, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్‌, రాజేంద్రగౌడ్‌, శ్రీనివాస్‌, సీఐలు, ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 11:27 PM