పారిశుధ్యం, స్వచ్చతపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:58 PM
స్వచ్చత, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కార్పొరేషన్ మేయర్ ధర్ని మధూకర్ అన్నారు. సోమవారం నగర కార్పొరేషన్ సర్వసభ్య సమావే శాన్ని డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్‌తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
నగర కార్పొరేషన్ మేయర్ ధర్ని మధూకర్
సర్వసభ్య సమావేశానికి బహిష్కరించిన బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్ గౌడ్
మంచిర్యాలక్రైం,జూన్29(ఆంధ్రజ్యోతి): స్వచ్చత, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కార్పొరేషన్ మేయర్ ధర్ని మధూకర్ అన్నారు. సోమవారం నగర కార్పొరేషన్ సర్వసభ్య సమావే శాన్ని డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్‌తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఎజెండా అంశాలపై చర్చించి తీర్మానించారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యం, హైమాస్ట్ లైటింగ్, రోడ్డు మరమ్మతులు డంపింగ్ యార్డు వ్యర్థాల నిర్వహణ కోసం మిషన్ల కొనుగోలు, కాంట్రాక్టు పద్ధతిలో పారిశుధ్య కార్మికుల జీతా లు, తదితర అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా 15వ డివిజన్ కార్పొరేటర్ చింత పం డు శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డు ఆఫీసర్లు హాజరుకావడం లేదని వారిని ప్రశ్నిస్తే ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నామని చెప్పి తప్పించుకుంటున్నారని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సబ్ స్టేషన్ రోడ్డులో రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని రోడ్డుకు మరమ్మతులు చేయాలని అభ్యర్థించారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ సత్తార్ తమ డివిజన్‌లో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు చేయించాలని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే 15వ డివిజన్ ఆర్‌అండ్ ఆర్ కాలనీలో మిషన్‌భగీరథ పైప్‌లైన్ వేయించాలని డివిజన్‌లో పందుల బెడద అధికంగా ఉందని దానిపై దృష్టి సారించాలన్నారు. వివిధ వార్డులకు సంబంధించిన కార్పొరే టర్లు వార్షకాలం దృష్ట్యా పారిశుధ్యం, తాగునీరు, డైటింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరిం చాలని అభ్యర్థించగా మేయర్ స్పందిస్తూ వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని తాగునీరు, పారిశుధ్యం, స్వచ్చత దిశగా బడ్జెట్ రూపొందించి ఆమోదించామన్నారు. స్వచ్ఛత దిశగా మంచిర్యాల కార్పొరేషన్ పని చేస్తోందన్నారు.
సమావేశాన్ని బహిస్కరించిన బీజేపీ...
మున్సిపల్ సాధారణ సమావేశాన్ని బీజేపీఫ్లోర్ లీడర్ గాజుల ముకేశ్‌గౌడ్ బహిష్కరించారు. తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాలతో పాటు 57వ డివిజన్ ప్రపోజల్ చేసింది కాకుండా వేరే విధంగా తమ ఇష్టానుసారంగా కేటాయింపులు సరైంది కాదన్నారు. తీర్మానం లేకుండానే కాంగ్రెస్ మేనిఫెస్లో ప్రకారం తమకు ఇష్టం వచ్చినట్లుగా మున్సిపల్ ఫండ్‌ను దుర్వినియగం చేస్తున్నారని ప్ర శ్నించడంతో తనను సస్పెండ్ చేయాలని కమిషనర్‌కు మేయర్ ఆదేశాలు జారీ చేయడం అప్రజా స్వామికమన్నారు. సమస్యలపై నిలదీస్తే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. అనంతరం మున్సిపల్ సమావేశం మందిరం ముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌తో పాటు కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.