Share News

‘ప్రజావాణి’ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:11 AM

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తెలిపారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి
దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌జయంతి

కలెక్టర్‌ అనురాగ్‌జయంతి

భువనగిరి గంజ్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి(రెవెన్యూ)తో కలిసి 57 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి పెండింగ్‌ లేకుండా క్షేత్రస్థాయిలో వెళ్లి పరిష్కరించాలన్నారు. రెవెన్యూశాఖ-35, జిల్లా గ్రామీణ అభివృద్ధి-8, ఉపాధి కల్పన-2, మునిసిపాలిటీ-2, విద్య, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, దేవాదాయ, ఆర్టీసీ, చేనేత, నేషనల్‌ హైవే, స్పెసల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శాఖలకు ఒక్కో ఫిర్యాదు అందింది. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జడ్పీ సీఈవో శోభారాణి, గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు.

వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి

భువనగిరి రూరల్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): వసతి గృహాల్లో పిల్లలకు నాణ్యమైన , సురక్షితమైన ఆహారం అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బీసీ ,ఎస్టీ, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, వంట సిబ్బంది , అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ నిర్వహించారు. కాగా బీబీనగర్‌ ఎయిమ్స్‌, స్వర్ణగిరి దేవస్థానం ఫుడ్‌ హ్యాండర్లకు శిక్షణ సర్టిఫికెట్లు అందచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రెవెన్యూ వెంకారెడ్డి, ఫుడ్‌ సేప్టీ డిజగ్నేటెడ్‌ ఆఫీసర్‌ స్వాతి, జడ్పీ సీఈవో శోభారాణి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మనోహర్‌, జిల్లా సంక్షేమ అధికారి కెనర్సింహారావు పాల్గొన్నారు. కాగా సోమవారం కలెక్టరేట్‌లో ఇన్నోవేషన్‌ పంచాయతీ కార్యక్రమ పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు.

Updated Date - Apr 07 , 2026 | 12:11 AM