kumaram bheem asifabad- ‘పది’పై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Nov 05 , 2026 | 11:02 PM
విద్యా ర్థుల భవితకు తొలిమెట్టు పదో తరగతి. విద్యాశాఖ, ఉపాధ్యాయుల పని తీరుకు పదో తరగతి పరీక్షలు కీలకం. 2026-27 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు ప్రణాళికలు సిద్ధం చేసి కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ నెల 2(సోమవారం) నుంచి జనవరి 12వరకు సిలబస్ పూర్తి చేసేందుకు సెలవులు పోను 57 పని దినాలకు ప్రత్యేక తరగతుల షెడ్యూలును ఖరారు చేశారు.
- వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
- ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యా యులు
ఆసిఫాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యా ర్థుల భవితకు తొలిమెట్టు పదో తరగతి. విద్యాశాఖ, ఉపాధ్యాయుల పని తీరుకు పదో తరగతి పరీక్షలు కీలకం. 2026-27 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు ప్రణాళికలు సిద్ధం చేసి కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ నెల 2(సోమవారం) నుంచి జనవరి 12వరకు సిలబస్ పూర్తి చేసేందుకు సెలవులు పోను 57 పని దినాలకు ప్రత్యేక తరగతుల షెడ్యూలును ఖరారు చేశారు. పాఠశాలల పనివేళల అనంతరం సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రధానోపాద్యాయులను అదేశించారు.ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాశాకాధికారులు కసరత్తు చేస్తున్నారు.
- 173 పాఠశాలల్లో..
జిల్లాలో అన్ని యాజమాన్య పరిధిలో 173 పాఠశా లల్లో పదో తరగతి విద్యార్థులు 7,518 మంది ఉన్నారు. బాలురు 3,536, బాలికలు 3,982 ఉన్నారు. ఇందులోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఉన్నత పాఠశాలల్లోని 2,866 మంది పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. వీరికి బోధించే అంశాలపై ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నవంబరు 2 నుంచి జనవరి 12వరకు పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. పాఠ్యాంశాల వారీగా ఏ రోజు ఏ పాఠ్యాంశం బోధించాలో షెడ్యూలును ఖరారు చేసి పాఠశాలల్లో సాయంత్రం వేళల్లో ప్రతే ్యక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి విద్యాబోధన సాగిస్తున్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
- 57 పని దినాల్లో..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 57 పని దినాలలో ప్రత్యేక తరగతులకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ ఖరారు చేసింది. వారంలో మొదటి రోజు గణితం, రెండో రోజు ఫిజీకల్ సైన్సు, మూడో రోజు బయో సైన్సు. నాలుగో రోజు సాంఘికశాస్త్రం ఐదో రోజు ఇంగ్లీషు, ఆరో రోజు తెలుగు, ఏడో రోజు హిందీ విషయాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని షె డ్యూల్‌ను ఖరారు చేశారు. రోజువారీ ప్రత్యేక తరగతుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాల ని, సిలబస్ పూర్తయిన వెంటనే ఉపాధ్యాయులు రివి జన్ తరగతులు నిర్వహించాలని ఈ మేరకు విద్యాశాఖ సంబందిత పాఠశాలల ప్రధానోఫాధ్యా యులను ఆదేశించింది.
- మూడేళ్లుగా ఫలితాల్లో వెనుకంజ..
కాగా మూడేళ్లుగా పదో తరగతి ఉత్తీర్ణతలో జిల్లా వెనుకంజలో ఉంది. జిల్లా పదో తరగతి ఫలితాల్లో మూడేళ్లుగా రాష్ట్రంలో 28 నుంచి 32 స్థానాలకే పరిమితమ వుతోంది. గతేడాది పరీక్షలకు 6,932 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా 6,527 మంది ఉత్తీర్ణులు కాగా రాష్ట్రంలో 28వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లాలో ఉత్తమ పలితాలు సాధించేందుకు విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారిం చిం ది. విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహం చడంతో పాటు పాఠశాలలకు విద్యార్థుల గైర్హాజరుపై ఫోకస్ పెం చింది. నవంబరు నెలను శత శాతం హాజరు మాసంగా ప్రకటించింది. ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులను ఇందుకు రాష్ట్ర విద్యా శాఖ బాధ్యులను చేస్తూ ఉపాధ్యాయులతో పాటు ప్రతీ విధ్యార్థి నిత్యం తరగతులకు హాజరయ్యేలా ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టాలని ఆదేశించింది.
వందశాతం ఫలితాలు సాధించడంపై దృష్టి..
- సచ్చిదానందచారి, జిల్లా విద్యాధికారి
పదో తరగతిలో వంద శాతం ఫలితాలను సాధిం చేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ప్రారంభించాం. విద్యార్థుల్లో సబ్జెక్టుల వారీగా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందిం చేందుకు అన్ని ఏర్పాట్లను చేపడుతున్నాం. ఈ ఏడాది జిల్లాలో 7,518 మంది విద్యార్థులు పదోతర గతి పరీక్షలు రాయనున్నారు.