Share News

kumaram bheem asifabad- పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - Jun 27 , 2026 | 10:58 PM

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులు, మందుల నిలువలు, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించి రోగులకు అందుతున్న సౌకర్యాలు, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

kumaram bheem asifabad- పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఆసుపత్రిలో రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులు, మందుల నిలువలు, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించి రోగులకు అందుతున్న సౌకర్యాలు, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తుందని, ఈ క్రమంలో ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మురుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. వర్షాకాలం అయినందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుక ోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయ పాలన పాటిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని, నీటి నిలువలు లేకుండా చెత్త పేరుకు పోకుండా ఎప్పటికప్పుడు తొలగించేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. హాజరు పట్టిక పరిశీలించి గైర్హాజరు అయిన వైద్యులు, ఆసుపత్రి పర్యవేక్షకులు విధులకు రానందున ఉన్నతాధికారులకు చర్యల నిమిత్తం సిఫారసుతో పాటు షోకాజు నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకునే విధంగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించకుంటే చర్యలు

జిల్లాలో ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులు నిబంధనలు పాటించకంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం ఆహార భద్రతపై నిర్వహించిన అవగాహన సమావేశంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, ఆహార పదార్థాల దుకాణాల నిర్వాహకులతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, మిఠాయి దుకాణాలు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించడం ప్రతీ వ్యాపారి బాధ్యత అని అన్నారు. వంటల తయారీలో ఉపయోగించే నూనెలు, మసాలా దినుపులు, పాలు, పెరుగు తదితర ముడి పదార్థాల నాణ్యమైనవే వినియోగించాలని అన్నారు. గడువు తేదీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదన్నారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, కోడిగుడ్లు, మాంసం వంటి ఆహార పదార్థాలను తాజాగా నిల్వ ఉంచి విక్రయించాలని తెలిపారు. అపరిశుభ్రమైన, గడువు ముగిసిన లేదా నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయించినా, దుకా ణాల్లో నిలువ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు జిల్లాలోని ఆహార విక్రయ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేస్తూ నాణ్యత ప్రమాణాలు అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామీణాభి వృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్‌, జిల్లా ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 10:58 PM