Share News

kumaram bheem asifabad- వందశాతం హాజరుపై స్పెషల్‌ డ్రైవ్‌

ABN , Publish Date - Nov 13 , 2026 | 10:29 PM

విద్యా ర్థులు, ఉపాధ్యాయులు హాజరుపై రాష్ట్ర విద్యా శాఖ దృష్టి సారించింది. కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌ హాజరు నమో దు ఆశాజనకంగా ఉంటున్నా వాస్తవ పరిస్థితు ల్లో వ్యత్యాసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యం లో సమగ్ర శిక్ష విభాగం సరికొత్త కార్యాచరణ సిద్ధం చేసింది.

kumaram bheem asifabad- వందశాతం హాజరుపై స్పెషల్‌ డ్రైవ్‌
లోగో

- ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెలాఖరు వరకు అమలు

- ఎఫ్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరిగా వేయాల్సిందేనని విద్యాశాఖ ఆదేశాలు

కాగజ్‌నగర్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): విద్యా ర్థులు, ఉపాధ్యాయులు హాజరుపై రాష్ట్ర విద్యా శాఖ దృష్టి సారించింది. కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌ హాజరు నమో దు ఆశాజనకంగా ఉంటున్నా వాస్తవ పరిస్థితు ల్లో వ్యత్యాసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యం లో సమగ్ర శిక్ష విభాగం సరికొత్త కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నవంబరు నెలను ప్రత్యేక హాజరు మహోత్సవం వంద శాతం అటెం డెన్స్‌ డ్రైవ్‌గా ప్రకటిస్తూ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నెలాఖరు వరకు సాగే ఈ డ్రైవ్‌ ప్రభుత్వ పాఠశా లల స్థితిగతులను మార్చే అవకాశం ఉంది.

- జిల్లా వ్యాప్తంగా ఇలా..

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 720, కస్తూర్బాగాంఽ దీ విద్యాలయాలు 15, ఆసిఫాబాద్‌లో అర్బన్‌ రెసిడె న్షియల్‌ స్కూల్‌ ఉంది. ఆయా స్కూళ్లలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది 2,13 5 మంది ఉన్నా రు. 41,218 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠ శాలల్లో హాజరులో జవాబుదారీతనాన్ని తప్పనిసరిగా చేశారు. రెసిడెన్షియన్‌, నాన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల ల్లో విద్యార్థులతో పాటు బోధన, భోదనేతర సిబ్బంది ముఖ గుర్తింపు హాజరై నమోదు చేయాల్సిందేదనని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీరో నాట్‌ క్యాప్చర్‌ విధానం అమలు చేస్తుంది. ఏ పాఠశాలల్లో కూడా హాజరు నమోదు కాలేదు అనే కేటగిరిలు కనిపించ డానికి వీలు ఉండదు. నెట్‌ వర్క్‌ లేదు. పరికరం పని చేయటం లేదు వంటి సాంకేతిక కారణాలకు సమ యం పరిమితి విధించారు. డివైస్‌, నెట్‌వర్క్‌, ఎన్‌రోల్‌మెంటు సమస్యలను 48 గంటల్లో పరిష్కరిం చాలని ఆదేశించారు. అలాగే అధికారిక పనులపై వెళ్లే ఉపాధ్యాయుల ఆన్‌డ్యూటీ(ఓడీ) వివరాలను 24 గంటల వ్యవధిలోనే నమోదు చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు సక్రమంగా పాఠాలు చెప్పినా, విద్యార్థులు బడికి వస్తేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇందుకు పని దినాల్లో వంద శాతం వాస్తవ హాజరు సాధించడమే లక్ష్యంగా వారం వారం ప్రగతి సాధించాలి. నవంబరులో ప్రత్యేక డ్రైవ్‌ నేపథ్యంలో జిల్లా, మండల స్థాయి అధికారులు నిరం తరం హాజరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు. జిల్లా విద్యాధికారితో పాటు ఎంఈవోలు, కాంప్లెక్సు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయం తో పని చేయాలని ఆదేశాల్లో సూచించారు. సమీక్షలు నిర్వహించి ఏ పాఠశాలల్లో తక్కువ హాజరు ఉంటే అక్కడ తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నారు.

- నిర్లక్ష్యంతోనూ..

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుటుంబ వ్యవసాయ పనులతో పాటు నిర్లక్ష్యంతోనూ విద్యార్థులు పాఠశాల లకు దూరమవుతున్నారు. ఇక నుంచి వరుసగా ఐదు రోజులు, అంత కంటే ఎక్కువ కాలం పిల్లలకు బడికి దూరమైతే వారి జాబితా రూపొందించాలి. కేవలం తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి వదిలేయకుండా ఉపాధ్యా యులు విద్యార్థుల ఇళ్లకు సందర్శించాల్సి ఉంటుంది. గైర్హాజరుకు కారణాలను తెలుసుకోవాలి. చదువు ప్రాధాన్య తను వివరించి, పిల్లలకు బడిబాట పట్టేలా అవగాహన కల్పించాలి. గుస్సాడీ, దండారీ ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గిరిజన విద్యార్థులకు పాఠశా లలకు దూరమయ్యే అవకాశం ఉండడంతో వందశాతం హాజరు సాధించడం కష్టమేనని పలువు రు చెబుతున్నారు. ఈ విషయమై డీఈవో సచ్చిదానం దచారిని వివరణ కోరగా ఈ నెలాఖరు వరకు హాజరుపై ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగుతున్నట్టు తెలిపారు. ఎంఈవోలు, క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతీ రోజు పర్యవే క్షించాలి. అటెండెన్స్‌ పై సమీక్షా చేపట్టాలి. వందశాతం హాజరు లక్ష్యంగా సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

Updated Date - Nov 13 , 2026 | 10:29 PM