kumaram bheem asifabad- పక్కాగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
ABN , Publish Date - Apr 04 , 2026 | 10:59 PM
పక్కాగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. హైదరాబాద్‌లోని ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, సహాయ ఎన్నికల అధికారులతో శనివారం రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రల్ అధికారి సుదర్శణ్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): పక్కాగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. హైదరాబాద్‌లోని ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, సహాయ ఎన్నికల అధికారులతో శనివారం రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రల్ అధికారి సుదర్శణ్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. తహసీల్దార్‌లు, సూపర్‌వైజర్లు, బూత్ స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేయాలని, బూత్ స్థాయి అధికారుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పారు. వారికి గుర్తింపు కార్డులు అందజేయాలని తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం జాబితా తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేయాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులకు ప్రక్రియ నిర్వహణలో సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఓటర్లు మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి కలెక్టర్ కె హరిత, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 678 పోలింగ్ ఉన్నాయని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ స్థాయి అధికారిని నియమించామని అన్నారు. బూత్ స్థాయి అధికారులకు, సూపర్‌వైజర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. వారికి గుర్తింపు కార్డులు అందజేశామని చెప్పారు. బూత్‌స్థాయి ఏజెంట్ల జాబితా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి తీసుకుంటున్నామని వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించామని తెలిపారు. ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో చేపట్టే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.