kumaram bheem asifabad- పది అనుత్తీర్ణులకు ప్రత్యేక తరగతులు
ABN , Publish Date - May 14 , 2026 | 10:53 PM
ఇటీవల పదో తరగతి ఫలితాల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులను అడ్వా న్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తూ ఉత్తీ ర్ణులయ్యేలా జిల్లా విద్యాశాఖ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు వారికి జిల్లాలో నాలుగుచోట్ల ప్రత్యేక తరగ తులను నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న ప్రారంభమై వచ్చే నెల 3వరకు కొనసాగిం చనున్నారు. వీటికి హాజ రయ్యే వారికి అల్పాహారం ఇవ్వడంతో పాటు రవాణా చార్జీలు చెల్లిస్తారు. జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 94.16శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 28వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని పీఎంశ్రీ ప్రభుత్వ, స్థానిక సంస్థల నుంచి దాదాపు 300మంది విద్యార్థులు ఫెయిలయ్యారని అధికారులు చెబుతున్నారు.
- జిల్లాలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు
బెజ్జూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పదో తరగతి ఫలితాల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులను అడ్వా న్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తూ ఉత్తీ ర్ణులయ్యేలా జిల్లా విద్యాశాఖ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు వారికి జిల్లాలో నాలుగుచోట్ల ప్రత్యేక తరగ తులను నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న ప్రారంభమై వచ్చే నెల 3వరకు కొనసాగిం చనున్నారు. వీటికి హాజ రయ్యే వారికి అల్పాహారం ఇవ్వడంతో పాటు రవాణా చార్జీలు చెల్లిస్తారు. జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 94.16శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 28వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని పీఎంశ్రీ ప్రభుత్వ, స్థానిక సంస్థల నుంచి దాదాపు 300మంది విద్యార్థులు ఫెయిలయ్యారని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు జిల్లాలో అను త్తీర్ణులైన వారికి ప్రత్యేక తరగతులు కొనసాగిస్తున్నట్లు జిల్లా విద్యా అధికారి లలిత వివరించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఫెయిలైన విద్యార్థులను ఎంపిక చేసిన పాఠశాలల్లోని శిబిరాల్లో చేర్పించాలని ఆదేశిం చారు.
రెండు డివిజన్ల పరిధిలో..
జిల్లాలోని ఆసిఫాబాద్ డిబిజన్‌లో రెండు, కాగజ్‌నగర్ డివిజన్‌లో రెండు కేంద్రాల చొప్పున నాలుగు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక తరగతులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆసిఫా బాద్ డివిజన్‌లోని జడ్పీహెచ్‌ఎస్(బాలికలు) ఆసిఫా బాద్, పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ సిర్పూర్(యు), కాగజ్‌న గర్ డివిజన్‌లోని పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ పెంచికల పేట, పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ ఓల్డ్ కాగజ్‌నగర్‌లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి మండలా లకు చెందిన విద్యార్థులు, పీంఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ సిర్పూర్(యు) లో సిర్పూర్ (యు), కెరమెరి, జైనూరు, లింగాపూర్ మండలాల విద్యార్థులు, పీంఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ పెంచికలపేటలో బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట విద్యార్థులు, పీంఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ కాగజ్‌నగర్‌లో కాగజ్‌నగర్, కౌటాల, సిర్పూర్(టి) మండలాలకు చెం దిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతు న్నాయి. ఉదయం నుంచి సాయంత్రం బోధిస్తారు. వీరందరికి అల్పాహారం అందించడంతో పాటు రూ.1000రవాణా చార్జీలు చెల్లించనున్నారు. దీంతో శిబిరాల్లో పాల్గొనే ఒక్కో విద్యార్థిపై రూ.1100రాష్ట్ర విద్యాశాఖ ఖర్చు చేయనుం దని తెలుస్తోంది. దీంతో పాటు విద్యార్థికి పుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ వంటి కోసం రూ.100ఇవ్వనుండగా మొత్తం రూ.ఒక్కో విద్యార్థికి రూ.1100ఖర్చు చేయనుంది.
విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు..
- ఎంఈవో సునీత, బెజ్జూరు
రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో అనుత్తీర్ణులైన వారి కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది. ఫెయి లైన విద్యార్థులు పక్కాగా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందు కోసం సంబంధిత పాఠశా లల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్ప గించాం. ప్రతీ విద్యార్థి ప్రత్యేక తరగతులకు హాజర య్యేలా ఏర్పాటు చేశాం.