Share News

మైనింగ్‌ స్కామ్‌ విచారణకు ప్రత్యేక బృందం

ABN , Publish Date - May 31 , 2026 | 05:21 AM

బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్‌ దందాపై సీఐడీ విచారణకు రంగం సిద్ధమైంది. మైనింగ్‌ స్కామ్‌పై విచారణ చేపట్టాలంటూ డీజీపీ కార్యాలయానికి శనివారం సాయంత్రం ప్రభుత్వ ఆదేశాలు అందాయి.

మైనింగ్‌ స్కామ్‌ విచారణకు ప్రత్యేక బృందం

  • సీఐడీలో మెరికల్లాంటి అధికారుల ఎంపికకు కసరత్తు

  • విచారణ చేపట్టాలని ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలు

బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్‌ దందాపై సీఐడీ విచారణకు రంగం సిద్ధమైంది. మైనింగ్‌ స్కామ్‌పై విచారణ చేపట్టాలంటూ డీజీపీ కార్యాలయానికి శనివారం సాయంత్రం ప్రభుత్వ ఆదేశాలు అందాయి. దీంతో పాటు మైనింగ్‌ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఫిర్యాదు కాపీ సైతం సీఐడీకి అందినట్లు తెలిసింది. ఈ క్రమంలో మైనింగ్‌ స్కామ్‌ విచారణ కోసం మెరికల్లాంటి అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని, ముందుగా విజిలెన్స్‌ నివేదికను పరిశీలించి, మైనింగ్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్న తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

‘ఇంటిగ్రేటెడ్‌ కార్డు’కే మహాలక్ష్మి అనుసంధానం

ఆర్టీసీలో మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇంటిగ్రేటెడ్‌ కార్డు’కే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుసంధానం చేయనుంది. ఈ మేరకు ఆ కార్డులోనే పథకానికి సంబంధించిన వివరాలను కూడా పొందుపరచనుంది. ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్‌ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులనే పరిగణలోకి తీసుకుంటుండగా, త్వరలో వీటి స్థానంలో ఇంటిగ్రేటెడ్‌ కార్డు అందుబాటులోకి రానుందని అధికారవర్గాలు తెలిపాయి.

Updated Date - May 31 , 2026 | 05:21 AM