ఉగాది, రంజాన్‌లకు ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:22 AM
ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. పండుగ సెలవుల కోసం.....
యథావిధిగా మహాలక్ష్మి పథకం
ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. పండుగ సెలవుల కోసం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ముఖ్యంగా మంగళ, బుధ వారాల్లో (17, 18) ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, అందుకు తగినట్లుగా అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అలాగే పండుగలు ముగిసిన తర్వాత నగరానికి తిరిగి వచ్చే వారి కోసం 23న ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఈ ప్రత్యేక బస్సుల్లో 1.5 శాతం వరకు చార్జీలను సవరించనున్నారు. రెగ్యులర్ బస్సుల్లో మాత్రం సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. కాగా, పండుగ రోజుల్లో కూడా ‘మహాలక్ష్మి ’ పథకం యథావిధిగా అమల్లో ఉంటుంది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఎప్పటిలాగే ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని, ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం 040-69440000, 23450033 నంబర్లను సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
సబ్‌ప్లాన్ నిధులపై భట్టితో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల చర్చ
బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపైన చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు మంగళవారంనాడు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సబ్ ప్లాన్ కింద వారి నియోజకవర్గాల్లో ఏమైనా పనులు ఉంటే ప్రతిపాదనలు ఇవ్వాలంటూ ఆయా ఎమ్మెల్యేలకు భట్టివిక్రమార్క సూచించారు.