Share News

వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ABN , Publish Date - Apr 27 , 2026 | 10:52 PM

వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి అనిత అన్నారు. సోమవారం మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాచ్‌ ఆఫ్‌ వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మా ట్లాడారు.

వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో అనిత

డీఎంహెచ్‌వో అనిత

కోటపల్లి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి అనిత అన్నారు. సోమవారం మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాచ్‌ ఆఫ్‌ వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మా ట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల పరిధిలో టీకాలు త ప్పిన పిల్లలకు టీకాలు ఇవ్వాలన్నారు. ఇందు కోసం వైద్యాధికారులు, సిబ్బంది అన్ని రకాల వ్యాక్సినేషన్‌లను తీసుకుని వెళ్లాలని, అలాగే ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే నిర్వ హించి వివరాలను నమోదు చేయాలని ఆదే శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాను సారం ఏప్రిల్‌, జులై, అక్టోబరు నెలల్లో తప్పిపో యిన పిల్లలందరికి వ్యాక్సినేషన్‌ ఇచ్చే కార్యక్ర మం జరుగుతుందన్నారు. కోటపల్లి ఆరోగ్య కేం ద్రంలో నలుగురు పిల్లలకు వ్యాక్సినేషన్‌తో పాటు ఏడుగురు పిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇప్పించారు. వైద్య సిబ్బంది, వైద్యాధికారులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని గ్రా మాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను నిర్వ హిం చి అందరికి టీకాలు అందేలా చర్యలు చేపట్టా లని సిబ్బంది సమయ పాలన పాటిస్తూ వైద్య సేవలందించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్‌ రాజేష్‌, డీపీహెచ్‌ఎన్‌ ఆర్‌ఎస్‌ పద్మ , సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 10:53 PM