Share News

kumaram bheem asifabad- విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ABN , Publish Date - Mar 25 , 2026 | 10:31 PM

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలుర వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. విద్యార్థుల గదులు, వంట శాల, నిత్యావసర సరుకుల నిలువ గది, భోజనశాల, పరిసరాలను పరిశీలించారు.

kumaram bheem asifabad- విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
అల్పాహారం పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలుర వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. విద్యార్థుల గదులు, వంట శాల, నిత్యావసర సరుకుల నిలువ గది, భోజనశాల, పరిసరాలను పరిశీలించారు. సాయంత్రం విద్యార్థులకు అందిస్తున్న స్నాక్స్‌ రుచి చూశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు. ఆహారం తయారు సమయంలో తాజా కూరగాయలు వినియోగించాలన్నారు. గదుల్లో శుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పీవో తెలిపారు.

వినియోగదారులకు ఇబ్బంది కలగొద్దు

కాగజ్‌నగర్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా ఇంధన సరఫరా సక్రమంగా అందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. కాగజ్‌ణగర్‌ మండల కేంద్రంలోని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పెట్రోల్‌ బంక్‌ను బుధవారం జీసీసీ ఉట్నూర్‌ డివిజనల్‌ మేనేజర్‌ సందీ ప్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు. పెట్రోల్‌ బంక్‌లో జరుగుతున్న లావాదేవీలు, రిజిస్టర్లు, టాయిలెట్స్‌, డ్రింకింగ్‌ వాటర్‌, గాలి మిషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ వినియోగదారులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. పెట్రోల్‌ బంక్‌లో తాగునీరు, మూత్రశాలల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని తెలిపారు. ఇంధనం అవసరం మేరకు ముందస్తుగా తెప్పించుకోవాలని తెలిపారు. నోస్టాక్‌ బోర్డులు పెట్టవద్దని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.

Updated Date - Mar 25 , 2026 | 10:31 PM