Share News

పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ABN , Publish Date - Jul 07 , 2026 | 10:32 PM

గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌ రావు పేర్కొన్నారు.

పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

డీపీవో వెంకటేశ్వర్‌రావు

జైపూర్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌ రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గంగిపెల్లి, కుందారం, వే లాల గ్రామాల్లో ఎంపీవో శ్రీపతి బాపురావుతో కలిసి సందర్శించారు. పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న సర్‌ నమోదు ప్రక్రియను పరిశీలించి షెడ్యూల్‌ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. గ్రామ ప్రజలకు ఫారాలు నింపడంలో ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేయాలని, సకాలంలో అందరు ఫారాలు అందించేలా చూడాలన్నారు. వర్షాకాలం దృష్య్టా సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా చూడాలని, నీరు నిల్వ ఉన్న చోట్ల ఆయిల్‌ బాల్స్‌ వేయాలన్నారు. అన్ని వార్డుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని కార్యదర్శులకు సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా నీటి ట్యాంకులను క్లోరినేషన్‌ చేయాలన్నారు. అనంతరం పంచాయతీ రికార్డులను తనిఖీ చేసి రికార్డులను అప్‌డేట్‌ చేయాలన్నారు. పంచాయతీ సమావేశాన్ని ప్రతి నెల నిర్వహించాలన్నారు. ఆయన వెంట సర్పంచులు వినోద, స్వప్న, కార్యదర్శులు , బీఎల్‌వోలు ఉన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 10:32 PM