Share News

కడియం, దానం అనర్హత పిటిషన్లపై తీర్పు నేడు

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:44 AM

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ బుధవారం తీర్పు వెలువరించనున్నారు.

కడియం, దానం అనర్హత పిటిషన్లపై తీర్పు నేడు

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ బుధవారం తీర్పు వెలువరించనున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పిటిషన్లు దాఖలు కాగా విచారణ అనంతరం 8 మందికి స్పీకర్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేల అంశంపై ఇదివరకే విచారణ ముగిసినా తీర్పు రిజర్వు చేశారు. బుధవారం ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో కడియం, దానం విషయంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తీర్పు వెలువరించనున్నారు. కాగా వీరిద్దరి విషయంలో స్పీకర్‌ తీర్పుపై రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Mar 11 , 2026 | 04:44 AM