Share News

కడియం, దానం అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ విచారణ

ABN , Publish Date - Mar 06 , 2026 | 01:11 AM

పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్లపై...

కడియం, దానం అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ విచారణ

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ విచారణ జరిపారు. గురువారం అసెంబ్లీలోని ప్రత్యేక చాంబర్‌లో ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాదులు.. కడియం, దానం తరఫు న్యాయవాదులు సమర్పించిన ఆధారాలను స్పీకర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలను నమోదు చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్లపై విచారణ ముగియగా.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ పూర్తికాలేదు. దానంపై విచారణను స్పీకర్‌ శనివారానికి వాయిదా వేశారు.

Updated Date - Mar 06 , 2026 | 01:11 AM