Share News

kumaram bheem asifabad- వరుస చోరీలు.. ప్రజల బెంబేలు

ABN , Publish Date - Aug 30 , 2026 | 10:57 PM

జిల్లాలో వరుస చోరీలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తు తున్నారు. వరుస దొంగతనాల, చైన్‌ స్నాచింగ్‌ పాల్పడిన వారంతా మహారాష్ట్ర ముఠాగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గతంలో ఇళ్లు, ఆలయాలు, దుకాణాలు, బస్టాండులు, రైల్వేస్టేషన్లను లక్ష్యం చేసుకొని చోరీలకు పాల్పడిన దుండగులు ప్రస్తుతం మహిళల మెడల్లోని బంగారు ఆభరణాపై కన్నేశారు.

kumaram bheem asifabad- వరుస చోరీలు.. ప్రజల బెంబేలు
లోగో

- పోలీసులకు సవాల్‌గా మారిన కట్టడి

కాగజ్‌నగర్‌, ఆగస్టు 30 (ఆంద్రజ్యోతి): జిల్లాలో వరుస చోరీలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తు తున్నారు. వరుస దొంగతనాల, చైన్‌ స్నాచింగ్‌ పాల్పడిన వారంతా మహారాష్ట్ర ముఠాగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గతంలో ఇళ్లు, ఆలయాలు, దుకాణాలు, బస్టాండులు, రైల్వేస్టేషన్లను లక్ష్యం చేసుకొని చోరీలకు పాల్పడిన దుండగులు ప్రస్తుతం మహిళల మెడల్లోని బంగారు ఆభరణాపై కన్నేశారు. తాళం వేసిన ఇంటిని టార్గెట్‌ చేస్తూ చోరిలకు పాల్పడుతున్నారు. చోరీలకు జరుగుతున్న తీరు పూర్తిగా సీసీ కెమెరాలో చిక్కుతున్నప్పటికీ ఈ కేసుల్లో పురోగతి లేని పరిస్థితి నెలకొంది. పది రోజుల క్రితం కాగజ్‌నగర్‌లోని సంతోషి జువెలర్స్‌లో చోరి జరిగింది. ఇందులో కూడా సీసీ కెమెరాకు చోరికి పాల్పడిన వ్యక్తి స్పష్టంగా ఆనవాళ్లు లభించాయి. ఈ సంఘటన జరిగిన రెండు రోల్లోనే ఓల్డు కాలనీల్లో రెండు ఇళ్లలో వెండి ఆభరణాలు అపహరణకు జరిగింది. మళ్లీ వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాగజ్‌నగర్‌ పట్టణ ప్రధాన కేంద్రమైన ఎన్టీఆర్‌ చౌరస్తా సమీపంలోని త్రినేత్ర మార్ట్‌లో నలుగురు కలిసి చోరీకి పాల్పడదం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. నెల రోజుల క్రితం కూడా కాగజ్‌నగర్‌ ఎఫ్‌ కాలనీ నుంచి బైక్‌ పై వస్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయినప్పటికీ ఇప్పటి వరకు ఈ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. కాగా ఈ చోరీకి పాల్పడిన వ్యక్తులు వాంకిడి మీదుగా మహారాష్ట్రకు వెళ్లినట్లు తేలింది. ఈచోరీలకు పాల్పడిన వారంతా కూడా ముఖాలకు మాస్కులు, హెల్మెట్టు ధరించి గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకొని చోరీలు చేసి పరారవుతున్నారు. అలాగే గతేడాది 19న కాగజ్‌నగర్‌ బస్టాండు నుంచి బయలుదేరిన చింతలమానేపల్లికి చెందిన మహిళ హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉన్న మూడున్నర తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఏప్రిల్‌ 8న కాగజ్‌నగర్‌ కాపువాడకు చెందిన మహిళ మెడలోని బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు. మే 28న ఆసిఫాబాద్‌ మండలం మాణికిగూడ్‌ అంగన్‌వాడి కార్యకర్త పద్మ విధులు ముగించుకొని బస్సు కోసం వేచి ఉండగా, బైక్‌పై వచ్చిన దుండగులు మాటల్లో పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా కాగజ్‌నగర్‌ రైల్వే కాలనీలో ఇంటి ఎదుటు కూర్చున్న మహిళ గుర్తు తెలియని వ్యక్తి లాక్కుని పరారయ్యాడు గత నెలలో సిర్పూరు(టి) అప్సర్‌ఖాన్‌ ఇంట్లో నగదు చోరి, మాజీ జడ్పీటీసీ నీరెటి రేఖ ఇంట్లో చోరి జరుగటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో వరుస చోరీ సంఘటనలు జరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

అంతరాష్ట్ర ముఠాపై అనుమానాలు..:

వరుస ఘటనల్లో దుండగులు ఉపయోగిస్తున్న పద్ధతి, బైక్‌లపై వచ్చి క్షణాల్లో చోరీ చేసి పారి పోతు న్న తీరు, ముఖాలను హెల్మెట్లు, మాస్కులతో కప్పుకోవడం వంటి అంశాల నేపథ్యంలో అంతరాష్ట్ర ముఠా సభ్యుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నా రు. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఒక వైపు చైన్‌ స్నాచింగ్‌లు, మరో వైపు ఇళ్లలో చోరిలు జరుగుతుండటంతో పోలీసులకు ఈ కేసులను ఛేదించేందుకు సవాలుగా మారింది. గతంలో జరిగిన చోరీల కేసుల్లో నిందితుల వివరాలు, ఇతర జిల్లాలో నమోదైన కేసులను పరిశీలించి దొంగల ముఠా కదలికలపై నిఘా పెడుతున్నారు. రాత్రి, సాయం త్రం వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల్‌ వద్ద కూడా గస్తీని పెంచారు.

పక్కాగా వివరాలు సేకరిస్తున్నాం..

ప్రేంకుమార్‌, పట్టణ సీఐ

చోరీ జరిగిన కేసుల్లో క్లూస్‌టీం ద్వారా అన్ని వివరాలు సేకరిస్తున్నాం. గతంలో చోరీ కేసుల్లో ఉన్న వ్యక్తులపై వివరాలు సేకరిస్తున్నాం. సీసీ ఫుటేజీలను కూడా విడుదల చేశాం. కేసులను ఛేదించేందుకు అని కోణాల్లో పరిశీలిస్తున్నాం. ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

Updated Date - Aug 30 , 2026 | 10:57 PM