పలువురు హోంగార్డులను ప్రశంసించిన ఎస్పీ
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:38 PM
ఇటీవలి గ్రామ పం చాయతీ ఎన్నికల విధుల్లో మెరుగైన సే వలందించిన ఆరుగురు హోం గార్డుల ను ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పా టిల్ ప్రశంసించి సర్టిఫికెట్లను గురువా రం అందజేశారు.
నాగర్‌కర్నూల్ క్రైం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : ఇటీవలి గ్రామ పం చాయతీ ఎన్నికల విధుల్లో మెరుగైన సే వలందించిన ఆరుగురు హోం గార్డుల ను ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పా టిల్ ప్రశంసించి సర్టిఫికెట్లను గురువా రం అందజేశారు. జిల్లాలోని వివిధ పో లీస్ స్టేషన్లలో పనిచేసే ఆశీర్వాదం, ల క్ష్మయ్య, షఫియోద్దీన్, ఎం.నరేందర్ కుమార్, ఎం.దేవుడు, ఎస్.చంద్రశేఖర్‌ల ను ఎస్పీ అభినందించారు.
పోలీస్ పెట్రోల్ పంప్ సిబ్బందికి కానుక
నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ పెట్రోల్ పంప్ సిబ్బందికి ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ నూ తన సంవత్సరంకానుక ప్రకటించారు. సిబ్బం దికి రూ.1000 బోనస్‌తో పాటు నెల జీతాన్ని రూ.14వేల నుంచి 15వేలకు పెంచుతూ నిర్ణ యం తీసుకున్నారు. ఎస్పీ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్‌ఐ జగన్, రాఘవరావు, ఆర్‌ఎస్‌ఐ గౌస్‌పాషా, బీఆర్ ఎస్ వెంకటనారాయణ, సీసీబాలరాజు పాల్గొన్నారు.