Share News

సదరన్‌ ట్రావెల్స్‌కు ప్రిఫర్డ్‌ ఇంటర్నేషనల్‌ టూర్‌ ఆపరేటర్‌ అవార్డు

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:04 AM

హైదరాబాద్‌ కేంద్రంగా దేశవ్యాప్తంగా విస్తరించిన సదరన్‌ ట్రావెల్స్‌ అంతర్జాతీయ పురస్కారాన్ని సాధించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన ...

సదరన్‌ ట్రావెల్స్‌కు ప్రిఫర్డ్‌ ఇంటర్నేషనల్‌ టూర్‌ ఆపరేటర్‌ అవార్డు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కేంద్రంగా దేశవ్యాప్తంగా విస్తరించిన సదరన్‌ ట్రావెల్స్‌ అంతర్జాతీయ పురస్కారాన్ని సాధించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రిఫర్డ్‌ ఇంటర్నేషనల్‌ టూర్‌ ఆపరేటర్‌ అవార్డును ప్రధానమంత్రి మ్యూజియం డైరెక్టర్‌ అశ్వని లోహానీ చేతులమీదుగా సంస్థ ఎండీ కృష్ణమోహన్‌ అలపాటి అందుకున్నారు. అంతర్జాతీయ పర్యాటక రంగంలో తమ సంస్థ అందిస్తున్న సేవల గుర్తింపునకు ఈ పురస్కారం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 45 లక్షల మందికి పర్యాటక సేవలు అందించామన్నారు. పర్యాటక రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు తమ సంస్థ నిత్యం కృషి చేస్తుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Apr 24 , 2026 | 04:04 AM