Sangareddy District: 19 నుంచి సంగారెడ్డి జిల్లాలో సౌత్‌ఇండియా సైన్స్ ఫెయిర్
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:34 AM
దక్షిణాది రాష్ట్రాల సైన్స్ ఫెయిర్‌ను ఈనెల 19 నుంచి 23వ తేదీ దాకా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో...
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాల సైన్స్ ఫెయిర్‌ను ఈనెల 19 నుంచి 23వ తేదీ దాకా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో ఉన్న గాడియం స్కూల్‌లో నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బెంగళూర్‌లోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్, టెక్నాలాజికల్ మ్యూజియం సహకారంతో ఈ ఫెయిర్‌ను నిర్వహించనుంది. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్టా్ట్రల నుంచి 35 సైన్స్ స్టాళ్లు ఉండనున్నాయి. ఇందులో విద్యార్థుల బృందానికి చెందినవి 10, వ్యక్తిగతంగా విద్యార్థులకు చెందినవి 15, మరో 10 ఉపాధ్యాయులు తయారు చేసినవి ప్రదర్శించనున్నారు. సైన్స్ ఫెయిర్‌కు 4 వేల మంది దాకా విద్యార్థులు హాజరుకానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.