స్థానిక సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:34 PM
స్థానిక సమస్యలను పరిష్క రించాలని కోరుతూ సోమవారం బీజేపీ నాయకులు చెన్నూరు పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా చెన్నూరు పట్టణంలో సమస్యలు రాజ్యమేలుతున్నా య న్నారు. అయినా అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా
చెన్నూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సమస్యలను పరిష్క రించాలని కోరుతూ సోమవారం బీజేపీ నాయకులు చెన్నూరు పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా చెన్నూరు పట్టణంలో సమస్యలు రాజ్యమేలుతున్నా య న్నారు. అయినా అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. పట్ట ణంలో శ్మశాన వాటిక నిర్మించాలని, పాత బస్టాండ్ కూరగాయల మార్కెట్ ను సంపూర్ణంగా నిర్మించాలని, బైపాస్ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, తహసీల్దార్ కార్యాలయాన్ని వెంటనే నీటి పారుదల శాఖ భవ నానికి మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే ఆగిపోయిన బస్ డిపో ని ర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పట్టణాధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, నాయకులు రాపర్తి వెంక టేశ్వర్, కొండపాక చారి, జాడి తిరుపతి, వెంకటనర్సయ్య, శ్రీనివాస్, రాజ య్య, శివకృష్ణ, పాల్గొన్నారు.