Share News

పోడు భూముల సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:43 PM

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టంకు లోబడే పోడు భూముల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని ఎడగట్ట గ్రామంలో నిబంధనలకు అతిక్రమించి అటవీ భూములను సాగు చేస్తున్న పోడు సాగుదారులతో ఆయన మాట్లాడారు.

పోడు భూముల సమస్యలకు పరిష్కారం
పోడు సాగుదారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కోటపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టంకు లోబడే పోడు భూముల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని ఎడగట్ట గ్రామంలో నిబంధనలకు అతిక్రమించి అటవీ భూములను సాగు చేస్తున్న పోడు సాగుదారులతో ఆయన మాట్లాడారు. మొదటగా జిల్లా అటవీ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, అటవీ డివిజనల్‌ అధికారి సర్వేశ్వర్‌ , చెన్నూరు రూరల్‌ సీఐ కృష్ణతో కలిసి పోడు భూములను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చట్టం ప్రకారం 2005కు ముందు సాగులో ఉండి పట్టా పొందిన అర్హులైన గిరిజన రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. అలాగే 2005 నాటికి 75 సంవత్సరాలు కాస్తులో ఉండి పట్టా పొందిన గిరిజనేతరులకు అవకాశం ఉంటుందని , 2005 తర్వాత నూతనంగా అటవీ భూములు సాగు చేస్తున్న వారు చట్టపరిధిలోకి రారని తెలిపారు. దీనిపై స్థానికులకు అర్ధమయ్యేలా వివరించాలన్నారు. ఇట్టి భూములకు సంబంధించి చెన్నూరు అటవీ రేంజ్‌కార్యాలయంలో మ్యాప్‌ అందుబాటులో ఉందని, సందేహాలున్న వారు మ్యాప్‌నుపరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:43 PM