kumaram bheem asifabad- ఘనంగా బక్రీద్ ప్రార్థనలు
ABN , Publish Date - May 28 , 2026 | 10:53 PM
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ సందర్భంగా గురువారం ముస్లింలు జిల్లా వ్యాప్తంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహిచారు. ఈ మేరకు ఈద్గాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలువురు నాయకులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకు అలింగనం చేసుకొని పండుగ శుభకాంక్షలు తెలుపుకున్నారు. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, నాయకులు చిన్నమల్లన్న, తారీక్‌లు బక్రీద్ శుభకాంక్షలు తెలిపారు.
- ముస్లింలకు పలువురు నాయకులు శుభాకాంక్షలు
ఆసిఫాబాద్‌రూరల్, మే 28 (ఆంధ్రజ్యోతి): త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ సందర్భంగా గురువారం ముస్లింలు జిల్లా వ్యాప్తంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహిచారు. ఈ మేరకు ఈద్గాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలువురు నాయకులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకు అలింగనం చేసుకొని పండుగ శుభకాంక్షలు తెలుపుకున్నారు. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, నాయకులు చిన్నమల్లన్న, తారీక్‌లు బక్రీద్ శుభకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసానికి మున్సిపల్ వైస్‌చైర్మన్ ఆహ్మద్ వెళ్లి శుభకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అకాష్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవిందర్, నాయకులు సాయిశ్రావణ్, బాపురావు తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలో బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఈద్దా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పండుగ ఆవశ్యకతను వివరించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిర్‌తో పాటు ఆయా పార్టీలకు చెందిన నాయకులు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డులకు చెందిన కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి)లో బక్రీద్ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): కౌటాల మండల కేంద్రంలో కూడా బక్రీద్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు ఎల్కపల్లి, మర్తిడి, కుకుడ తదితర గ్రామాల్లో గురువారం బక్రీద్ పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా ముస్లింలు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారం బక్రీద్ పండుగను ముస్లిం లు ఘనంగా జరుపుకున్నారు.మండల కేంద్రంలో గల ఈద్గా వద్దకు ముస్లింలు ఉదయనే చేరుకోని ప్రత్యేక నమాజ్ చేశారు .ప్రత్యేక నమాజ్ నిర్వహించిన అనంతరం ఒకరినొకరు అలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు బక్రీద్ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ శాంతి, సోదరభావం త్యాగస్ఫూర్తి, పరస్పర సహకారం పాటించాలని సందేశం ఇచ్చారు ముస్లింలకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, సర్పంచ్ ఆత్రం ఓంప్రకాష్, ఉప సర్పంచ్ పెందొర్ రాము, మాజీ సర్పంచ్ ఆర్క నాగోరావు శుభాకాంక్షలు తెలిపారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలో ముస్లింలు బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరినొకరు అలింగనం చేసుకొని శుభకాంక్షలు తెలుపుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు కలాం, ఇఫ్తేకార్, యూనస్, కాంగ్రెస్ నాయకులు మునీర్ ఆహ్మద్, రజాక్‌లు ఈద్గా వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.