సోలార్ మోడల్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:22 PM
సోలార్ ఇంధన వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృ తంగా ప్రోత్సహించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు.
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్/ కందనూలు/ తెలకపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : సోలార్ ఇంధన వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృ తంగా ప్రోత్సహించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. నాగర్‌కర్నూల్ ని యోజకవర్గంలోని తూడుకుర్తి, బల్మూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాల మోడల్ సోలార్ గ్రీన్ ఎనర్జీ గ్రామాలగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో గ్రీన్ ఎనర్జీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇప్పటికే విజయ వంతంగా అమలవుతున్నదని తెలిపారు.
క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి
క్షయ వ్యాధి నిర్మూలనను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుని పని చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ వైదారోగ్య శాఖ అధికా రులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహిం చిన వైద్యశాఖ సమీక్ష సమావేశం జిల్లా వైద్యా ఽధికారి డాక్టర్ కృష్ణ, వివిధ మండలాల వైద్యాధి కారులతో సమీక్షించారు.
ప్రీ ప్రైమరీ తరగతుల పరిశీలన
తెలకపల్లి మండలం గౌరారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రీ ప్రైమరీ తరగతులను, గ్రామంలో నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ శనివారం తనిఖీ చేశారు. మండ ల కేంద్రంలో కొనసాగుతున్న ఓటర్ల డిజిటలై జేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. పకడ్బం దీగా చేపట్టాలని ఆదేశించారు.
లక్ష్యాలు సాధించాలి : డీఎంహెచ్‌వో
కందనూలు, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్దేశించిన లక్ష్యా లను తప్పనిసరిగా సాధించాలని జిల్లా వైద్యా రోగ్య శాఖ అధికారి కే.కృష్ణ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మం దిరంలో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికా రులకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ సురేష్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా క్టర్ భీమానాయక్, డాక్టర్ తారాసింగ్, డీపీవో రేణయ్య, ఎపిడమియాల జిస్ట్ ప్రవల్లిక, ఏపీ వోలు, వైద్యాఽధికారులు పాల్గొన్నారు.