Share News

సింగరేణిలో సౌరశక్తి

ABN , Publish Date - Aug 08 , 2026 | 11:21 PM

సింగరేణి ఆధ్వర్యంలో తొలిసారిగా జిల్లా మందమర్రిలో ఏర్పాటు చేసిన ఒక మెగావాట్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎన ర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎస్‌ఎస్‌) ప్లాంటు సత్ఫలి తాలను ఇస్తోంది.

సింగరేణిలో సౌరశక్తి

సత్ఫలితాలిస్తున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌....

-సోలార్‌ విద్యుత్‌ నిల్వలో సింగరేణి విజయకేతనం

-రాష్ట్రంలోనే తొలిసారిగా మందమర్రిలో ఏర్పాటు

-సంస్థకు ఆర్థిక లబ్ధి చేకూర్చడంలో తోడ్పాటు

-భవిష్యత్తులో మరిన్ని ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు

మంచిర్యాల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఆధ్వర్యంలో తొలిసారిగా జిల్లా మందమర్రిలో ఏర్పాటు చేసిన ఒక మెగావాట్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎన ర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎస్‌ఎస్‌) ప్లాంటు సత్ఫలి తాలను ఇస్తోంది. గతేడాది నవంబర్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించగా, ఈ సంవత్సరం జనవరిలో ప్లాంటును ప్రారంభించారు. పునరుత్పాదక విద్యుత్తు పెంపుదల కో సం సింగరేణి కాలరీస్‌ కంపెనీ మందమర్రి ఏరియా లోని సంస్థకు చెందిన 28 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌కు అనుబంధంగా బీఈఎస్‌ఎస్‌ను ఏర్పాటు చే సింది. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్‌ విద్యుత్తులో మిగులు విద్యుత్‌ను ఉచితంగా గ్రిడ్‌కు సరఫరా చేయ కుండా బ్యాటరీలో నిలువ చేసుకొని, అవసరమైనప్పు డు వాడుకునే విధంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ ను రాష్ట్రంలోనే తొలిసారిగా మందమర్రిలో ప్రారంభిం చారు. రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహంతో సింగరేణితో సహా పలు సంస్థలు సోలా ర్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇలా ఉత్పత్తి చే స్తున్న విద్యుత్తును తెలంగాణ ట్రాన్స్‌కో గ్రిడ్‌ ద్వారా అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నారు. సింగరేణిలో డిమాండ్‌ లేని సమయాల్లో ఉత్పత్తి అవుతున్న సోలార్‌ విద్యుత్‌ను గ్రిడ్‌కు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అలా మిగులు సోలార్‌ విద్యుత్తును పూర్తిగా సద్విని యోగం చేసుకోవడానికి బీఈఎస్‌ఎస్‌ ద్వారా నిల్వ చేసి గరిష్టంగా విద్యుత్‌ వినియోగం ఉండే సమయంలో కంపెనీ అవసరాలకు వినియోగించనున్నారు.

రూ. 2.73 కోట్ల అంచనా వ్యయంతో....

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 250 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని సంకల్పిం చిన నేపథ్యంలో మందమర్రిలో ఏర్పాటు చేసిన బీఈ ఎస్‌ఎస్‌ తొలి అడుగుగా చెప్పవచ్చు. సుమారు రూ. 2.73 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సిస్టమ్‌ వల్ల సింగరేణి ఏడాదిలో వినియోగించబడని 9.1 లక్షల యూనిట్ల సోలార్‌ విద్యుత్తును సద్వినియోగం చేసుకో వడం ద్వారా రూ. 70 లక్షల వరకు ఆదా అయ్యే అవ కాశం ఉంది. సింగరేణి సంస్థ ఇప్పటికే ఎనిమిది ఏరి యాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇవి సమర్థంగా పనిచేస్తూ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో 147 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఓపెన్‌ యాక్సెస్‌ ప్లాంట్లుగా, మిగిలిన 98.50 మెగావాట్ల ప్లాంట్లను ఇన్‌ హౌజ్‌గా గుర్తించి తెలంగాణ విద్యుత్‌ గ్రిడ్డులకు అనుసంధానం చేసింది. సోలార్‌ విద్యుత్‌ను సంస్థ మందమర్రి, శ్రీరాం పూర్‌ ఏరియాలలోని గనులు, కాలనీలకు అందిస్తోంది. తన అవసరాలకు సరిపోను మిగిలిన 3లక్షల పై చిలు కు యూనిట్ల విద్యుత్‌ను బీఈఎస్‌ఎస్‌ యూనిట్‌లో ని ల్వ చేయడం ద్వారా అవసరమైన సందర్భంలో విని యోగించుకుంటోంది. తద్వారా సింగరేణికి ఇప్పటి వర కు రూ. 25 లక్షల పైచిలుకు ఆర్థిక లబ్ది చేకూరిన ట్లయింది. ఒక మెగావాట్‌ సామర్థ్యం గల బీఈఎస్‌ఎస్‌ యూనిట్‌ వల్ల ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్‌ ఆదా అవుతుండటంతో యాజమాన్యం భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇంధనశాఖ కార్యదర్శి వ్యాఖ్యలతో....

డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్‌ల వద్ద సో లార్‌, బ్యాటరీ స్టోరేజీలు, కెపాసిటర్‌ బ్యాంకులు, ఆధు నిక గ్రిడ్‌ నిర్వహణ విధానాలను సమన్వయం చేస్తూ నిరంతరాయ విద్యుత్‌ అందించాలని రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఈ నెల 7వ తేదీన వ్యాఖ్యానించారు. ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి, డైరెక్టర్లు, చీఫ్‌ ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయన హైద్రాబాద్‌ నుంచి మాట్లా డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పవర్‌ పా యింట్‌ ప్రజంటేషన్‌లో నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు ఎన్పీడీసీఎల్‌లో ఏర్పాటు చేయబోతున్న విధానాల గు రించి వివరించారు. సోలార్‌ ద్వారా నిల్వ చేసిన విద్యు త్‌ను వినియోగించడం ద్వారా మార్కెట్‌ ఆధారిత వి ద్యుత్‌ కొనుగోళ్లపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చునని సీఎండీ సైతం వివరించారు. ఉన్నతాధికారుల వ్యాఖ్య లను బట్టి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ ఏర్పాటు ఆ వశ్యకత తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో త్వరలోనే బీఈఎస్‌ఎస్‌ ప్లాంట్ల సంఖ్యను మరింతగా పెంచడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 08 , 2026 | 11:22 PM