Share News

kumaram bheem asifabad- భూసారం తగ్గిపోతోంది

ABN , Publish Date - Mar 30 , 2026 | 10:15 PM

పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ...సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించ కపోవడం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించడంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. గాఢత ఏటా పెరిగిపోతున్న తీరుతో భూములు పూర్తిగా సారం కోల్పోయి రానున్న కాలంలో చవుడు భూములుగా మారిపోయు ప్రమాదం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతు న్నప్పటికీ రైతులకు ఈ స్థాయిలో అవగాహన కల్పిం చడం లేదు.

kumaram bheem asifabad- భూసారం తగ్గిపోతోంది
లోగో

- సేంద్రియ ఎరువులపై అవగాహన కరువు

- సరఫరా కాని రసాయనాలు

- భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తే రైతులకు మేలు

బెజ్జూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ...సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించ కపోవడం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించడంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. గాఢత ఏటా పెరిగిపోతున్న తీరుతో భూములు పూర్తిగా సారం కోల్పోయి రానున్న కాలంలో చవుడు భూములుగా మారిపోయు ప్రమాదం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతు న్నప్పటికీ రైతులకు ఈ స్థాయిలో అవగాహన కల్పిం చడం లేదు. దీంతో వారు సైతం రెడీమేడ్‌ వ్యవసాయానికి అలవాటు పడడంతో భవిష్యత్తులో భూములు పంటలకు అనువుగా ఉండే పరిస్థితి లేదని వ్యవసాయ శాస్త్రవేత్త లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రైతులు దిగుబడి అధికంగా రావాలంటూ ఎరువులు, పురుగు మందులు గతంకంటే రెట్టింపుగా వినియోగిస్తుం డడంతో దీర్ఘకాలంలో భూముల సారంపై ప్రభావం పడుతున్నాయి,

- దూరంగా భూసార పరీక్షలు..

వ్యవసాయశాఖ సిబ్బందికి 2020 వరకు భూ సార పరీక్షలు చేయించే బాధ్యత వ్యవసాయ శాఖ సిబ్బందికి ఉంది. గత ఐదేళ్లుగా ఈ తరహా లక్ష్యాలు నిర్ణయించలే దు. రైతులే తమ ఆసక్తితో వచ్చి భూసార పరీక్షలు చేయించుకో వాలని సూచించగా ఆశించిన మేర రైతులు ముందుకు రావడం లేదు. భూసార పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ఏటా తగ్గిపోతున్న తీరు రైతుల అనాసక్తి అద్దం పడుతోంది. రైతు వేదికలు నిర్మించిన సమయంలో భూసార పరీక్షల కిట్‌లు అందుబాటులో ఉంచి రైతులకు అవసరమైనప్పుడు పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. అయితే కిట్‌లు ఇచ్చి రసాయ నాలు అందించలేదు. కొన్నిచోట్ల రసాయనాలు అయిపోగా ఇప్పటి వరకు సరఫరా చేయలేదు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, వరి పంటల సాగుపై దృష్టి సారించడంతో ఇతర పంటల సాగు తగ్గిపోతుంది. వరి పంటలను సైతం తొలగించి పత్తి సాగు చేస్తున్నారు. వరికి సైతం ఎకరాకు ఒకబస్తా యూరియా సరిపోతుందని వ్యవసా య అధికారులు చెబుతున్నా ప్రైవేటు కంపనీల మాటలు విని రైతులు మూడు బస్తాల వరకు యూరియా వినియోగిస్తుండగా ఇది భూసారం పై ప్రభావం పడుతోంది. యూ రియా లీటర్‌ బాటిళ్లలో తయారు చేయిస్తూ ప్రభుత్వం విక్ర యాలు చేపడుతున్నా వీటిని వినియోగించేం దుకు రైతులు ఆసక్తి చూపడం లేదు.

- భూసార పరీక్షలతో రైతులకు మేలు..

భూసార పరీక్షలతో రైతులకు మేలు చేకూ రనుంది. రైతులు సాగు చేస్తున్న పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులు వాడకం పెరగడంతో క్రమంగా భూసారం తగ్గుతూ వస్తోంది. రైతులు ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు నిర్వహించి, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంట సాగు చేసినట్లయితే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుం ది. ప్రభుత్వం కొన్నేళ్లుగా భూసార పరీక్షలను పూర్తిగా నిలిపి వేయడంతో దిగుబడిపై ప్రభావం ఏర్పడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షల కోసం ఆది లాబాద్‌ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుండడంతో రైతులపై ప్రయాణ భారంతో పాటు ఆర్థిక భారం కూడా పడు తోంది. రైతులకు భూసార పరీక్షలు అందుబా టులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఆసక్తి ఉంటే పరీక్షలు చేయిస్తాం..

- నాగరాజు, వ్యవసాయ అధికారి, బెజ్జూరు

భూసార పరీక్షలపై రైతులకు ఆసక్తి ఉంటే పరీక్షలు చేయిస్తాం. గత కొద్దేళ్లుగా ప్రభుత్వం భూసార పరీక్షలపై ఎటువంటి లక్ష్యాలు ఇవ్వ డం లేదు. దీంతో రైతులు భూసార పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. మూడేళ్లుగా రసాయనాల సరఫరా కూ డా ఆగిపోయింది. రైతులు తప్పనిసరగా భూ సార పరీక్షలు చేయించుకోవాలి. గతంలో రైతులకు పలుమార్లు అవగాహన కార్యక్రమా లు నిర్వహించినా ఆసక్తి చూపడం లేదు.

Updated Date - Mar 30 , 2026 | 10:15 PM