కుల నిర్మూలనతోనే సామాజిక న్యాయం
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:40 PM
దేశంలో ఇప్పటికీ కొ నసాగుతున్న కుల వివక్ష, అసమానతలకు చరమగీతం పాడి సామాజిక న్యాయం సాధించాల్సిన అవ సరం ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర టెలికాంశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ బహుదూర్ అన్నారు.
- రాష్ట్ర టెలికాం శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ బహుదూర్
నాగర్‌కర్నూల్ టౌన్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యో తి): దేశంలో ఇప్పటికీ కొ నసాగుతున్న కుల వివక్ష, అసమానతలకు చరమగీతం పాడి సామాజిక న్యాయం సాధించాల్సిన అవ సరం ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర టెలికాంశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ బహుదూర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో సింగిల్ విండో సమావేశ మందిరంలో ‘‘కుల నిర్మూలన- సామాజిక న్యాయం’’ అనే అంశంపై ప్రజా, సా మాజిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ బహుదూ ర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం జాతీయ అధ్య క్షుడు జెట్టి ధర్మరాజు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంకేశ్వరం నిరంజన్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచనలు, అభిప్రాయాల సేకరణలో భాగంగా ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. కు ల నిర్మూలన, సామాజిక సమానత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయ సేకరణ కార్యక్రమాలు చేపడుతామని ఆయన వెల్లడించారు. వక్తలు మాట్లాడుతూ దేశంలో ఇంకా కుల వివక్షత, అసమానతలు కొనసాగడం దారుణమన్నారు. కార్యక్రమంలో వక్తలు జి.సుధాకర్, రాంచందర్, జెట్టి చిన్నవెంకటేష్, అంతటి కాశన్న, ఎదిరేపల్లి కాశన్న, కొట్ర బాలు, కూరాకుల శ్రీనివాస్, శివశంకర్, మహేందర్, శాంతికుమార్, కొత్త మల్లేష్, జల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.