kumaram bheem asifabad- ప్రజలు లేకుండానే సామాజిక తనిఖీ ప్రజావేదిక
ABN , Publish Date - Feb 04 , 2026 | 10:38 PM
ప్రజలు లేకుండానే వివిధ శాఖల అధికారులు సామాజిక తనిఖీ బృందాలు, ఉపాధి హామీ టీఏలు, ఎఫ్‌లు, పంచాయతీ కార్యదర్శలు మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక బుధవారం నిర్వహించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన 2024-25 సంవత్సరం ఉపాధి హామీ పథకంలో 432 పనులకు గాను రూ.7.96 కోట్లు ఖర్చు చేశారు. పనులు తక్కువ చేయడం కూలీలకు వేతనాలు ఎక్కువగా వెళ్లి పోవడంతో దహెగాం క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ కె రాజేష్‌ను డీఆర్‌డీవో దత్తారాం సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
దహెగాం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రజలు లేకుండానే వివిధ శాఖల అధికారులు సామాజిక తనిఖీ బృందాలు, ఉపాధి హామీ టీఏలు, ఎఫ్‌లు, పంచాయతీ కార్యదర్శలు మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక బుధవారం నిర్వహించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన 2024-25 సంవత్సరం ఉపాధి హామీ పథకంలో 432 పనులకు గాను రూ.7.96 కోట్లు ఖర్చు చేశారు. పనులు తక్కువ చేయడం కూలీలకు వేతనాలు ఎక్కువగా వెళ్లి పోవడంతో దహెగాం క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ కె రాజేష్‌ను డీఆర్‌డీవో దత్తారాం సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వివిధ రకాల 18 ఉపాధా హామీ పనులకు గాను కూలీలు తక్కువగా వేతనాలు సామాజిక తనిఖీ బృందాలు గుర్తించాయి. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ఎఫ్‌ఏ, టీఏలు చేసిన తప్పిదాలకు గాను రూ.25 వేల జరిమానా విధించారు. ఉపాధి హామీ పథకంలో 24 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన సీసీ రోడ్లకు గాను రూ.1.62 లక్షలు రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహివంచిన ఇద్దరు క్షేత్ర సహాయకులు, ఇద్దరు టీఏలు, ముగ్గురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. కుంచవెల్లి, చౌక గ్రామ పంచాయతీల్లో ఇద్దరు చొప్పున మేట్లను విధుల నుంచి తొలగించారు. కోత్మీర్, పెసరికుంట, బోర్లకుంట గ్రామ పంచాయతీల్లో క్షేత్రసహాయకులు లేకుండా ఉపాధి పనులు చేపట్టడం సమస్యగా మారిందని సర్పంచ్‌లు సత్యనారాయణ, సతీష్, ఆర్ జయలక్ష్మి, స్రవంతి పీవో దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఉత్తర్వులు రాగానే నియమిస్తామని తెలిపారు. సమావేశంలో అంబుడ్స్‌మెన్ సాయిశ్రీ, క్యూసీ రమేశ్, ఎస్‌టీఎంవో వేణు, రవి, ఎంపీఏవో నస్రు ల్లాఖాన్, ఎంపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.