Share News

లేని పులికి ఆంక్షలెన్నో..

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:29 PM

మంచి ర్యాల జిల్లా కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో పులుల జాడ లేకపో యినా కట్టుదిట్టమైన ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు ప డక తప్పడం లేదు. ఎప్పుడో ఏడాదికో, రెండేండ్లకో ఒక సారి వచ్చే పులికోసం ఆంక్షలు విధించడం పట్ల ప్రజ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్ల పరి స్థితి అధ్వానంగా మారడంతో రాకపోకలకు ఇబ్బందు లు పడాల్సి వస్తోంది.

లేని పులికి ఆంక్షలెన్నో..

టైగర్‌జోన్‌తో అభివృద్ధికి ఆటంకం

రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ అనుమతుల నిరాకరణ

పల్లెల్లో రహదారులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు

గుంతలు, కంకర తేలిన రోడ్లపైనే రాకపోకలు

మంచిర్యాల, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మంచి ర్యాల జిల్లా కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో పులుల జాడ లేకపో యినా కట్టుదిట్టమైన ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు ప డక తప్పడం లేదు. ఎప్పుడో ఏడాదికో, రెండేండ్లకో ఒక సారి వచ్చే పులికోసం ఆంక్షలు విధించడం పట్ల ప్రజ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్ల పరి స్థితి అధ్వానంగా మారడంతో రాకపోకలకు ఇబ్బందు లు పడాల్సి వస్తోంది. అటవీ ప్రాంతం నుంచి వివిధ గ్రామాలు, ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు స రైన రోడ్డు మార్గాలు అనేక చోట్ల లేవు. వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రుభుత్వాలు నిధులు విడుదల చేస్తున్నప్ప టికీ అటవీ శాఖ అధికారులు అంగీకరించకపోవడంతో పల్లెల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితులు తయారయ్యాయి. పెద్దపెద్ద గుంతలు, కం కర తేలిన రహదారులపైనే ప్రజలు ప్రయాణాలు సా గించాల్సి వస్తోంది. పులులు లేని అడవిలో టైగర్‌జోన్‌ పేరిట ఆంక్షలు విధించడం పట్ల ్ఞ అసంతృప్తి వ్యక్తమ వుతోంది.. జిల్లాలోని వేమనపల్లి, జైపూర్‌, కోటపల్లి, మందమర్రి, జన్నారం, దండేపల్లి మండలాల్లోని అటవీప్రాంతాల్లో గల రహదారుల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది.

టైగర్‌ జోన్‌ ఎత్తివేతకు డిమాండ్‌..

పులుల సంరక్షణ పేరుతో టైగర్‌ జోన్‌ ఏర్పాటు చేయడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటవీశాఖ ఆంక్షల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో టైగర్‌జోన్‌ ఎత్తివేయాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. జన్నారం మండలకేంద్రంతో పాటు పలు గ్రామాలు ఆంక్షల వలయంలో ఉన్నాయి. అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీప్రాంతం నుంచి ఎటు చూసినా పది కిలోమీటర్ల మేర ఎకో సెన్సిటివ్‌ ఏరియా ఉండడంతో పనులు సాధ్యపడడం లేదు. గతంలో భారీ వాహనాలను కూడా ఈ రహదారి గుం డా అనుమతించకపోవడంతో ప్రజలు దీక్షలు చేపట్టి అనుమతులు సాధించారు. ఇదిలా ఉండగా ఎకో సెన్సి టివ్‌ జోన్‌ను వీలైనంత మేర కుదించాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రానికి చెందిన సామాజికకార్యకర్త భూమాచారి ఆధ్వర్యంలో మూడు నెలలుగా చేపడు తున్న నిరాహార దీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

మండలాలలో దుస్దితి ఇది..

ఫదండేపల్లి మండల కేంద్రం నుంచి ఊట్ల అటవీ ప్రాంతం గుండా కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తి ర్యాణి మండలం గుండాల వరకు రహదారి నిర్మాణా నికి గతఏడాది రూ.25కోట్లు మంజూరయ్యాయి. సంవ త్సరం గడుస్తున్నా నేటికీ నిర్మాణపనులు ప్రారంభం కాలేదు. అభయారణ్యంలో రోడ్డు నిర్మించాల్సి వస్తున్నం దున అటవీశాఖ అనుమతులు లేక పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ఆ నిధులు వెనక్కి వెల్లిపో యినట్లు తెలుస్తోంది.

ఫ వేమనపల్లి మండలం నాగారం నుంచి మంగి లపల్లి గ్రామం వరకు రోడ్డు నిర్మాణపనులు అర్ధాంత రంగా నిలిచిపోయాయి. అటవీ అనుమతులు రాకపోవ డంతో 5కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగకపోవ డంతో ఇబ్బందులు తప్పడం లేదు. టైగర్‌జోన్‌ పరిధి కావడంతో అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు.

ఫ జైపూర్‌ మండలం శివ్వారం అటవీప్రాంతంలో చె న్నూరు మండలం సోమనపల్లికి వెళ్లే దారిలో అటవీ అనుమతులు లేక రోడ్డు నిర్మాణపనులు నిలిచిపోయా యి. సుమారు 5కిలోమీటర్ల మేర కంకర తేలిన రో డ్డుపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

ఫ జన్నారం మండలంలో కోర్‌ ఏరియా పరిధిలోని అల్లినగర్‌, దొంగపెల్లి, మల్యాల గ్రామాలకు వెళ్లాలంటే దట్టమైన అటవీప్రాంతం గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మండలానికి వెళ్లే ప్రధానరహదారికి 16కి లోమీటర్ల దూరంలో ఆ గ్రామాలున్నాయి. గ్రామాలను మైదానం ప్రాంతానికి తరలించాలని అధికారులు ప్రతి పాదనలు సిద్ధం చేసి పంపినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. కే వలం టైగర్‌జోన్‌ పరిధిలో ఉన్నాయనే భావనతోనే ఆ గ్రామాల తరలింపు నిలిచిపోగా ప్రతీచిన్న పనికి కూడా ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

ఫ మందమర్రి మండలం ఆదిల్‌పేట గ్రామం నుంచి మామిడిగట్టు వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర అటవీప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి సాఽధ్యపడడం లేదు. అటవీశాఖ అనుమతులు లేక సంవత్సరాల తర బడి పనులు జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఫ తాండూర్‌ మండలం అచ్చలాపూర్‌ గ్రామం నుం చి చంద్రవెళ్లికి వెళ్లే రహదారిది కూడా అదే పరిస్ధితి. అటవీప్రాంతంలో ఉండడంతో సుమారు 2కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు మోక్షం కలగడం లేదు.

Updated Date - Oct 31 , 2026 | 11:29 PM