Share News

కారుపై దూకిన చుక్కల దుప్పి

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:13 AM

రహదారిపై వెళ్తున్న ఓ కారుపై పిడుగు పడినట్టుగా ఓ చుక్కల దుప్పి దూకింది. ఆ ధాటికి కారు ముందు అద్దంతో పాటు పైభాగం పూర్తిగా ధ్వంసమైంది.

కారుపై దూకిన చుక్కల దుప్పి

  • ముందు అద్దంలో ఇరుక్కుని మృతి

  • కారులోని ఒకరికి తీవ్ర గాయాలు

ఖానాపూర్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : రహదారిపై వెళ్తున్న ఓ కారుపై పిడుగు పడినట్టుగా ఓ చుక్కల దుప్పి దూకింది. ఆ ధాటికి కారు ముందు అద్దంతో పాటు పైభాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. ఆ వన్యప్రాణి చనిపోయింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి చంద్రకాంత్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం కారులో నిర్మల్‌ వెళ్తున్నారు. మార్గమధ్యలో ఖానాపూర్‌ మండలంలోని ఎక్బాల్‌పూర్‌ సమీపంలో అడవి మార్గంలో రహదారిపై వెళ్తున్న కారుపై ఒక్కసారిగా అడవిలో నుంచి పరిగెడుతూ వచ్చిన చుక్కల దుప్పి దూకింది. దీంతో కారుపై భాగం, ముందరి అద్దం పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన నిర్మల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చుక్కల దుప్పి కారు అద్దంలో ఇరుక్కుని బయటపడి ప్రాణాలు వదిలింది. మృత్యువాత పడిన దుప్పికి పశు వైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు ఎఫ్‌ఎ్‌సవో తెలిపారు.

Updated Date - Feb 11 , 2026 | 02:13 AM