Share News

ప్రశాంతంగా మేయర్‌, చైర్మన్‌ల ఎంపికప్రక్రియ

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:39 PM

జిల్లాలోని 1 కార్పోరేషన్‌, 4 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో భాగంగా మేయర్‌, డిప్యూటి మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

ప్రశాంతంగా మేయర్‌, చైర్మన్‌ల ఎంపికప్రక్రియ
మేయర్‌,చైర్మన్‌ల ఎంపికప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని 1 కార్పోరేషన్‌, 4 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో భాగంగా మేయర్‌, డిప్యూటి మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మంచిర్యాల కార్పోరేషన్‌లో గెలుపొందిన కార్పోరేటర్లతో మంచిర్యాలలోనిమున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల పరిశీకులు గంగాధర్‌, ఆర్డీవో శ్రీనివఆసరావు, కమీషనర్‌ అన్వేష్‌ల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం మేయర్‌గా ధరణి మధుకర్‌, డిప్యూటి మేయర్‌గా చల్ల రమ్యలను ఎన్నుకున్నారన్నారు.బెల్లంపల్లిలో సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, కమీషనర్‌సంప్‌లో సమక్షంలో చైర్‌పర్సన్‌గా దావ స్వాతి, వైస్‌ చైర్మన్‌గా రాగంశెట్టి సత్యనారాయణలను, చెన్నూరులో చైర్‌పర్సన్‌గా పెద్దింటి పద్మ, వైస్‌ చైర్మన్‌గా వినయ్‌లను, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో చైర్మన్‌గా దొంత అంజలి, వైస్‌ చైర్మన్‌గా మోతుకూరి రాజేశ్వరిలను ఎన్నుకున్నారన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో సమావేశానికి కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరం లేక ప్రమాణ స్వీకారం,చైర్‌పర్సన్‌,వైస్‌ చైర్మన్‌ ఎంపిక ప్రక్రియను ఈ నెల 17కు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాలన అధికారి రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 11:39 PM