kumaram bheem asifabad- లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్‌కార్డులు
ABN , Publish Date - Aug 15 , 2026 | 11:31 PM
జిల్లాలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్‌కార్డులు అందజేస్తున్నామని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. కలెక్టరేట్‌లో రేషన్‌కార్డు లబ్ధిదారులకు శనివారం స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్‌కార్డులు అందజేస్తున్నామని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. కలెక్టరేట్‌లో రేషన్‌కార్డు లబ్ధిదారులకు శనివారం స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మార్ట్ రేషనుకార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్డులో క్యూఅర్ కోడ్ స్కానింగ్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ జిల్లాలో 1,64,939 లబ్ధిదారులకు స్మార్ట్ రేషనుకార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషనుకార్డులతో ఎలాంటి అక్రమాలు జరుగకుండా నివారించవచ్చని చెప్పారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ రేషనుకార్డుదారులందరు స్మార్ట్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన అందరికి రేషనుకార్డులు అందజేయాలన్నారు. అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషనుకార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్, డీఆర్వో వేణు, ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, కృష్ణయ్య, సంబంధితశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.