Share News

ప్రజల భద్రత కోసమే స్మార్ట్‌రేషన్‌ కార్డులు

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:02 AM

ఎలాంటి అవ కతవకలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిం చేందుకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందిస్తున్నామని ప్రభుత్వ సలహా దారు హర్కర వేణుగోపాల్‌రావు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పేర్కొన్నారు.

ప్రజల భద్రత కోసమే స్మార్ట్‌రేషన్‌ కార్డులు

ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌రావు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : ఎలాంటి అవ కతవకలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిం చేందుకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందిస్తున్నామని ప్రభుత్వ సలహా దారు హర్కర వేణుగోపాల్‌రావు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకుని శనివారం కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి ప్రజలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు దూసుకువెళ్తుందన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందుబాటులోకి తీసు కువచ్చామన్నారు. మంచిర్యాలను అభివృద్ధి చేయడంలో కలెక్టర్‌, అ ధికారుల కృషి అభినందనీయమన్నారు. అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజల ప్రాథమిక సౌకర్యాల కోసం ఎలాం టి ఇబ్బందులు తలెత్తకూడదని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రా ష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి రేషన్‌ కార్డులు అందజేస్తున్నామన్నా రు. ఆరు గ్యారంటీల అమలులో స్మార్ట్‌ కార్డులు కీలకంగా మార నున్నాయని, రాష్ట్రంలో ప్రజాపాలన నిరంతర ప్రక్రియగా కొనసా గుతుందన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. పథకాలు సమర్ధవంతంగా అమలు కవాడానికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌, అదనపు కలెక్టర్‌లు చంద్రయ్య, రాములు, డీసీపీ భాస్కర్‌, సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, కనీస వేతనాల బోర్డు చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌, జిల్లా రెవెన్యూ అధికాఇర మోతిరాం, ఆర్డీవో శ్రీనివాసరావు, ట్రైనీ డిప్యూటి కలెక్టర్‌ విలాయత్‌ ఆలీ, మేయర్‌ ధర్ని మదుకర్‌, డిప్యూటి మేయర్‌ సల్ల రమ్య, డీసీఎస్‌వో బ్రహ్మారావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బానేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 12:02 AM