Share News

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వకం పనులు పునః ప్రారంభం

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:18 AM

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ఇన్‌లెట్‌-1 బ్రహ్మగిరి (దోమల పెంట) వద్ద సొరంగం తవ్వకం పనులు పునఃప్రారంభమయ్యాయి.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వకం పనులు పునః ప్రారంభం

బ్రహ్మగిరి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ఇన్‌లెట్‌-1 బ్రహ్మగిరి (దోమల పెంట) వద్ద సొరంగం తవ్వకం పనులు పునఃప్రారంభమయ్యాయి. ఉగాది సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం డ్రిల్లింగ్‌ మొదలు పెట్టారు. 2028 లోగా ఎస్‌ఎల్‌బీసీలో 9.559 కి.మీల తవ్వకం పనులు పూర్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. గతేడాది ఫిబ్రవరి 22న శ్రీశైలం ఎడమగట్టు సొరంగం వద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో నిలిచిపోయిన పనులను గత నెల 18న న్నేవారిపల్లి వైపు ఔట్‌లెట్‌-2 వద్ద ప్రారంభించారు. ఇన్‌లెట్‌-1 బ్రహ్మగిరి వద్ద డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ మెథడ్‌ (డీబీఎం) పద్దతిలో శుక్రవారం పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్రా, సాంకేతిక కమిటీ సభ్యులు, ఇరిగేషన్‌ శాఖ ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థ శ్రీశరవణ ఇన్‌ఫ్రా యాజమాన్యం పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 04:19 AM