Share News

ఎస్‌ఎల్‌బీసీ తవ్వకాల్లో జాప్యాన్ని సహించం

ABN , Publish Date - Feb 02 , 2026 | 02:51 AM

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నిర్మాణ పనుల పునరుద్ధరణలో జాప్యాన్ని ఉపేక్షించబోమని నీటిపారుదల మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హెచ్చరించారు.

ఎస్‌ఎల్‌బీసీ తవ్వకాల్లో జాప్యాన్ని సహించం

  • కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్లు సిద్ధం చేయాలి

  • అధికారులకు నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నిర్మాణ పనుల పునరుద్ధరణలో జాప్యాన్ని ఉపేక్షించబోమని నీటిపారుదల మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. రక్షణ నియమాళిని పాటిస్తూ తక్షణమే యంత్రాలు, సిబ్బందిని రంగంలో దింపి రోజుకు 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో నిరంతరం పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్ధరణపై ఆదివారం ఇక్కడ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రాజెక్టు పనుల నిర్వహణకు చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ)ను నియమించి అతడి పర్యవేక్షణ కింద ఎస్‌ఎల్‌బీసీ డివిజన్‌ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పనుల పర్యవేక్షణకు స్వతంత్ర కన్సల్టెంట్‌ను నియమించాలని కోరారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల తయారీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 16 తర్వాత ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీతో సమావేశం నిర్వహించనున్నామని, ఇందుకోసం పునరుద్ధరణ ప్రణాళికతో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు.

Updated Date - Feb 02 , 2026 | 02:51 AM