Share News

kumaram bheem asifabad-కాంగ్రెస్‌ సర్కార్‌కు చెంప పెట్టు

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:30 PM

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రస్‌ సర్కార్‌కు చెంప పెట్టు అని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. స్థానికంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావులను రాజకీయంగా దెబ్బతీయాలనే చూసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్యలకు హైకోర్టు తీర్పు గట్టిగా చెప్ప పెట్టులాంటిదని విమర్శించారు.

kumaram bheem asifabad-కాంగ్రెస్‌ సర్కార్‌కు చెంప పెట్టు
ఆసిఫాబాద్‌లో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రస్‌ సర్కార్‌కు చెంప పెట్టు అని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. స్థానికంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావులను రాజకీయంగా దెబ్బతీయాలనే చూసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్యలకు హైకోర్టు తీర్పు గట్టిగా చెప్ప పెట్టులాంటిదని విమర్శించారు. సమావేశంలో గుండి సర్పంచ్‌ రవీందర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, సర్పంచ్‌ పోచయ్య, ఉప సర్పంచ్‌ లక్ష్మి, కౌన్సిలర్లు సలాంబీన్‌ అహ్మద్‌, నాగజ్యోతి, నాయకులు అలీబీన్‌ అహ్మద్‌, అహ్మద్‌, నిసార్‌, నారాయణ, బలరాం, శ్రావణ్‌, నాగరాజు, రవి, ఖాసీం, ఉమారాణి, అన్సార్‌, దిలీప్‌, భీమేష్‌, మల్లేష్‌ పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): ఇటీవల హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌ పార్టీకి చెంప పెట్టు అని బీఆర్‌ఎస్‌ నాయకుడు కొంగ సత్యనారాయణ తెలిపారు. గురువారం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌పై లేని పోని ఆరోపణలు చేశారని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు చెంపపెట్టులా ఉందని చెప్పారు. ఇప్పటికైనా మాజీ సీఎంపై ఆరోపణలు మానుకోవాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగించిన రాజకీయ కక్షసాధింపుకు హైకోర్టు తీర్పుతో తేలిందని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. స్థానికంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావులను రాజకీయంగా దెబ్బతీయాలనే చూసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్యలకు హైకోర్టు తీర్పు గట్టిగా చెప్ప పెట్టులాంటిదని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అజయ్‌కుమార్‌, సర్పంచ్‌ సతీష్‌, నాయకులు అశుతోష్‌, సంతోష్‌, ఎక్నాథ్‌, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతిపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టకూడది హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వనికి చెంప పెట్టు అని మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు తోడసం ధర్మరావు అన్నారు. మండల కేంద్రంలో వారు ఈఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచులు ఆత్రం ఓంప్రకాష్‌, కుమ్ర భీంరావు తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌/లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై హై కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌ పార్టీకి చెంప పెట్టు అని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఇంతీయాజ్‌ లాల అన్నారు. జైనూర్‌, లింగాపూర్‌ మండలాల బీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయా సమావేశాలో సర్పంచ్‌లు కొడప ప్రకాష్‌, జాదవ్‌ శ్రావణ్‌ నాయక్‌, జాదవ్‌ రాజశేఖర్‌, అనుషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 11:30 PM