నైపుణ్యతతో కూడిన విద్య అందించాలి
ABN , Publish Date - May 02 , 2026 | 09:35 PM
ప్రభుత్వ పాఠశాలల పునర్నిమానం చేయాల్సిందేనని, విద్యార్థుల కు నైపుణ్యతతో కూడిన విద్య అందించాలని మంచి ర్యా ల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. నియోజకవ ర్గంలోని ఐదు మండలాలకు చెందిన ప్రధా నోపాధ్యా యులకు కుమార్ దీపక్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు
మంచిర్యాల క్రైం, మే 2 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల పునర్నిమానం చేయాల్సిందేనని, విద్యార్థుల కు నైపుణ్యతతో కూడిన విద్య అందించాలని మంచి ర్యా ల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. నియోజకవ ర్గంలోని ఐదు మండలాలకు చెందిన ప్రధా నోపాధ్యా యులకు కుమార్ దీపక్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ, కార్పొరేట్ పాఠశాలల్లో డబ్బులు చెల్లించలేని వి ద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా బాధ్య తాయుతంగా విద్యను అందించాలన్నారు. డ్యూటీ మైం డ్‌తో కాకుండా బాధ్యతతో చదువుచెప్పినప్పుడే నమ్మకం కలుగుతుందన్నారు. విద్యతోనే ఏదైనా సాధించగలమని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సా రించిందన్నారు. ప్రైవేటు పాఠ శాలల్లో చెప్పే ఉపాధ్యా యుల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఎంతో నైపు ణ్యం కలిగి ఉంటారన్నారు. నిర్లక్ష్యం, డ్యూటీ మైండ్ సెట్‌తో వెనుబడిపోయాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య గణనీయంగా తగ్గి పోతోందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న 15 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల భవనాలు అద్దెకు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఉపా ధ్యాయుడు ఉద్యోగం సంపాదించడంలో చూపించే శ్రద్ధ 25 శాతం విద్యార్థులకు చదువు చెప్తే మేధావులుగా త యారవుతారన్నారు. దౌడపల్లి ప్రభుత్వ పాఠశాలలో 90 మంది విద్యార్థులకు పది మంది ఉపాధ్యాయులు ఉండడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆగ్రహం
సమీక్ష సమావేశం జరుగుతున్న సమయంలో ప్రధా నోపాధ్యాయులు ముచ్చటించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకే క్రమశిక్షణ లేనప్పుడు విద్యార్థులకు ఎలా నేర్పుతారని అన్నారు.
నియోజకవర్గానికి రూ. 100 కోట్లు
కలెక్టర్ కుమార్ దీపక్
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య కోసం ఖర్చు చేస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. ప్రతీ పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డబ్బులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థు లు ఎందుకు చేరుతున్నారని ప్రశ్నించారు. హాజరుశాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మేయర్ మధుకర్, డీఈఓ యాదయ్య, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.