ఆరుగురు ఐపీఎస్‌లకు డీజీపీగా పదోన్నతి
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:27 AM
ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అదనపు డీజీపీలుగా ఉన్న ...
ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అదనపు డీజీపీలుగా ఉన్న 1995, 1996 బ్యాచ్‌కు చెందిన.. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు, హోంగార్డ్స్ విభాగం చీఫ్ స్వాతిలక్రా, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్, సీఐడీ అదనపు డీజీపీ చారుసిన్హా, గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ అనిల్ కుమార్, హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్‌లు డీజీపీ పదవికి ఎంప్యానల్ కావడంతో పాటు పదోన్నతి పొందారు. అయినా వారు తాత్కాలికంగా అవే స్ధానాల్లో కొనసాగుతారని సీఎస్ పేర్కొన్నారు.