Share News

Administrative Orders: ఆరుగురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ABN , Publish Date - Jan 01 , 2026 | 07:53 AM

రాష్ట్రంలో ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు.

Administrative Orders: ఆరుగురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

హైదరాబాద్‌, డిసెంబరు 31 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. పురపాలక శాఖలో పనిచేస్తున్న ఎర్రోళ్ల సుదర్శన్‌ను రవాణాశాఖకు, రవాణా శాఖలో పని చేస్తున్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజేశ్‌ను కీసర ఆర్డీవోగా డిప్యుటేషన్‌ మీద పంపించారు. కీసర ఆర్డీవోగా ఉన్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకట ఉపేందర్‌రెడ్డిని రవాణా శాఖకు బదిలీ చేశారు. ఆందోల్‌ ఆర్డీవోగా ఉన్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆర్‌.పాండును సంగారెడ్డి జిల్లా డీఆర్‌ఓగా బదిలీ చేశారు. డిప్యూటీ కలెక్టర్‌ హరికృష్ణను భూపాలపల్లి ఆర్డీవోగా, అక్కడే పని చేస్తున్న స్పెషన్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ను హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా బదిలీ చేశారు. హనుమకొండలో పని చేస్తున్న అదనపు కలెక్టర్‌ జి.పద్మజారాణిని ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

Updated Date - Jan 01 , 2026 | 07:53 AM