Share News

kumaram bheem asifabad- ఆరున్నర దశాబ్దాల చరిత్ర

ABN , Publish Date - Jan 30 , 2026 | 10:47 PM

ఆసిఫాబాద్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆరున్నర దశాబ్దాల కాలం మేజర్‌ గ్రామపంచాయతీగా కొనసాగి మున్సిపాలి టీగా రూపాంతరం చెందిన ఆసిఫాబాద్‌ మొదటిసారి ఎన్నికలకు సిద్ధమవుతోం ది. ఫిబ్రవరి 11న జరుగనున్న ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహత్మకంగా ముందుకు సాగుతున్నాయి.

kumaram bheem asifabad- ఆరున్నర దశాబ్దాల చరిత్ర
ఆసిఫాబాద్‌ పట్టణం

- మొదటి సారిగా పుర పోరుకు అధికారుల ఏర్పాట్లు

- చైర్మన్‌ పీఠంపై ప్రధాన పార్టీల గురి

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆరున్నర దశాబ్దాల కాలం మేజర్‌ గ్రామపంచాయతీగా కొనసాగి మున్సిపాలి టీగా రూపాంతరం చెందిన ఆసిఫాబాద్‌ మొదటిసారి ఎన్నికలకు సిద్ధమవుతోం ది. ఫిబ్రవరి 11న జరుగనున్న ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీని 20 వార్డులతో ఏర్పాటు చేశారు. తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతుం డడంతో వార్డు కౌన్సిలర్‌ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొన్నది. ప్రధాన పార్టీ లైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, బీఎస్పీ, సీపీఐలతో పాటు ఇతర పార్టీల నుంచి ఆశావహులు బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వీరితో పాటు స్వతంత్రులు కూడా బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. మొదటి సారి ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతుండడం తో మున్సిపల్‌ చైర్మన్‌ పదవిపై పోటీ పెరిగింది. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు కేటాయిం చడంతో ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇప్పటికే ప్రదాన పార్టీలు తమ పార్టీ చైర్మన్‌ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చైర్మన్‌ పీఠాన్ని చేజిక్కించుకుంటే భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో పార్టీకి బలం చేకూరుతుందని ఆయా పార్టీల నాయకులు భావిస్తున్నారు.

- 1913 నుంచి 1940 వరకు..

ఆసిఫాబాద్‌ ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉన్నది. 1913 నుంచి 1940 వరకు నిజాం నవాబు పాలన సాగిన కాలంలో జిల్లా కేంద్రంగా కొనసా గింది. ఆసఫ్‌ జాహీ వంశానికి చెందిన నిజాం నవాబు 1906లో అప్పటి జనగామను తాలూకాగా ప్రకటించి 1907లో తన వంశం పేరుతో ఆసిఫాబా ద్‌గా నామకరణం చేశారు. అన్ని జిల్లా కార్యాలయా లు 1913లో ఆదిలాబాద్‌ నుంచి ఆసిఫాబాద్‌కు మార్చారు. 1916లో ఇక్కడ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, డీఈవో, ఇంజనీరింగ్‌, కోర్టులు, జిల్లా జైలు, భవనాలను ఏర్పాటు చేశారు. 1940లో జిల్లా కేంద్రాన్ని తిరిగి ఆదిలాబాద్‌కు తరలించారు. జిల్లా కేంద్రం తరలిపోయినప్పటికి 1961 వరకు ఆసిఫా బాద్‌ మున్సిపాలిటీగానే కొనసాగింది. అనంతరం మేజర్‌ గ్రామపంచాయతీ స్థాయికి మార్చారు. ఆసిఫాబాద్‌ గ్రామ పంచాయతీ తొలి సర్పంచ్‌గా రాంచందర్‌రావు పైకాజీ సేవలు అందించారు. 2006, 2015లో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కోవ లక్ష్మి సర్పంచ్‌గా రెండు సార్లు విజయం సాధించా రు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిలిచి పోవడంతో ప్రత్యేకాఽ దికారుల పాలన కొనసాగింది. 2024లో రాజంపేటను ప్రత్యేక గ్రామపంచాయతీగా మార్చి 20 వార్డులతో కూడిన ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

- ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం..

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నూతన జిల్లాగా మేజర్‌ గ్రామపంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఆసిఫాబాద్‌ను మున్సిపా లిటీగా మార్చేందుకు అసెంబ్లీలో తీర్మానించినప్ప టికీ పట్టణంలోని రాజంపేట ప్రాంతం షెడ్యూల్‌ ఐదులో ఉండడంతో మున్సిపాలిటీగా మార్చేందుకు ఆటంకం ఏర్పడింది. దీంతో రాజంపేట ప్రాంతాన్ని కొత్త గ్రామపంచాయతీగా గుర్తించడంతో మున్సిపా లిటీగా ఆసిఫాబాద్‌ ఏర్పడడానికి మార్గం సుగమమైంది. ఏప్రిల్‌ 1, 2024 నుంచి ఆసిఫాబాద్‌ మున్సిపా లిటీగా ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని 3,831 విస్తీర్ణంలోని 16,597 మంది జనాభ కలిగిన 20 వార్డులతో మున్సిపాలిటీగా అవతరించింది. ఆసిఫాబాద్‌ పట్టణంతో పాటు గొడవెల్లి, జన్కాపూ ర్‌, ఆర్‌ఆర్‌ కాలనీ, హీరాపూర్‌ ప్రాంతాలను కలిపి మున్సి పాలిటీగా ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 11న తొలిసారి మున్సిపల్‌ ఎన్నికలు జరుగు తుండడంతో సర్వాత్ర ఆసక్తి నెలకొన్నది.

- పట్టణ పరిధిలో 13,927 ఓటర్లు..

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలోని 20 వార్డుల పరిధిలో 13,927 మంది ఓటర్లు ఉన్నా రు. ఇందులో 6,822 మంది పురుషులు, 7,103 మంది మహిళలు ఇద్దరు ఇతరులు ఉన్నారు. వీరు తొలిసారి మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటుహక్కు విని యోగించుకోనున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌, సాలేగూడ భాగాన్ని వార్డు నంబరు ఒకటిగా, గుండిరోడ్డు, దశ్నాపూర్‌ భాగాన్ని వార్డు రెండుగా, దశ్నాపూర్‌ మెయిన్‌రోడ్డు బాగాన్ని వార్డు మూడుగా, పైకాజీనగర్‌ కాలనీని వార్డు నాలుగుగా, బజారువాడి, రహమత్‌నగర్‌ను వార్డు ఐదుగా ఏర్పాటు చేశారు. రావులవాడ, బాపునగర్‌, గాంధీచౌ క్‌ ప్రాంతాలను వార్డు ఆరుగా, కంచుకోట, శివకేశవ మందిర్‌ రోడ్డును వార్డు ఏడుగా, తారకరామనగర్‌, గోడవెల్లి, గొడవెల్లి ఎస్సీ కాలనీని వార్డు ఎనిమిదిగా గుర్తించారు. కసాబ్‌వాడీ, హీరాపూర్‌ను వార్డు తొమ్మిదిగా, సందీప్‌నగర్‌, సందీప్‌నగర్‌ ఎస్సీ కాల నీ, ఎస్‌వీనగర్‌లను వార్డు పదిగా, సందీప్‌నగర్‌ భాగాన్ని వార్డు 11గా, గోండుగూడ, నూర్‌నగర్‌, మార్కెండేయ కాలనీ, సందీప్‌నగర్‌లను 12వ వార్డుగా ఏర్పాటు చేశారు. వైఎస్‌ఆర్‌ కాలనీ, ఆర్‌ఆర్‌కాలనీ, డ్రైవర్స్‌ కాలనీలను వార్డు 13గా, జన్కాపూర్‌ వార్డు 14గా, ఐసీడీఎస్‌ ఉస్మానీయ మజీద్‌, కోర్టు రోడ్డు, ఎన్‌జీఓ కాలనీలను వార్డు 15గా ఏర్పాటు చేశారు. హడ్కోకా లనీ, కంఠకాలనీ వార్డు 16గా, బజారువాడి, హడ్కో కాలనీ భాగం వార్డు 17గా, బజారువాడి వార్డు 18గా, బ్రాహ్మణవాడ వార్డు 19గా, ఖదీమజీద్‌, మంగళివాడ, బనార్‌వాడలను వార్డు 20గా ఏర్పాటు చేశారు.

Updated Date - Jan 30 , 2026 | 10:47 PM