Share News

కేటీఆర్‌.. మీ పార్టీ నేతల డ్రగ్స్‌ దందాపై మాట్లాడు!

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:23 AM

బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌.. కాంగ్రెస్‌ గురించి మాట్లాడే ముందు సొంత పార్టీ నాయకుల డ్రగ్స్‌ దందా గురించి మాట్లాడాలని మంత్రి సీతక్క సూచించారు.

కేటీఆర్‌.. మీ పార్టీ నేతల డ్రగ్స్‌ దందాపై మాట్లాడు!

  • రాహుల్‌ను తిడితే పెద్ద లీడర్‌వి అయిపోవు..: సీతక్క

హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌.. కాంగ్రెస్‌ గురించి మాట్లాడే ముందు సొంత పార్టీ నాయకుల డ్రగ్స్‌ దందా గురించి మాట్లాడాలని మంత్రి సీతక్క సూచించారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మీ వారసత్వాన్ని మీ నాయకులు ఫాంహౌ్‌సలలో కొనసాగిస్తున్నారు. డ్రగ్స్‌ కేసులో దొరికిన మీ నాయకుడిపై చర్యలు తీసుకోకపోవడంతోనే మీరు డ్రగ్స్‌ను ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతోంది’ అంటూ విమర్శించారు. రాహుల్‌ గాంధీని తిడితే పెద్ద లీడర్‌ అవుతానన్న భ్రమల్లో కేటీఆర్‌ ఉన్నాడని ఎద్దేవా చేశారు. కాగా, స్త్రీనిధి సంస్థలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, నిధులు దుర్వినియోగం చేసినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సీతక్క హెచ్చరించారు. సచివాలయంలో సమీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.2,064 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు పంపిణీ చేసినట్లు తెలిపారు.

Updated Date - Mar 17 , 2026 | 05:23 AM