కాంగ్రెస్‌పై అబద్ధపు ప్రచారం: సీతక్క
ABN , Publish Date - Feb 08 , 2026 | 07:16 AM
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్, బీజేపీలు అబద్ధపు ప్రచారంతో విషం చిమ్ముతున్నాయని, ఎన్ని కుట్రలు చేసినా...
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్, బీజేపీలు అబద్ధపు ప్రచారంతో విషం చిమ్ముతున్నాయని, ఎన్ని కుట్రలు చేసినా కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి సీతక్క అన్నారు. మునిసిపల్ ఎన్నికల సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శాస్తా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మహిళా సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రెండేళ్ల సీఎం రేవంత్ పానలో 70 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. మహిళలకు రూ.2500, పెన్షన్లు రూ.4 వేలు చేయడమనేది హామీ ల్లో మిగిలాయని, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంత ఆలస్యమైనా వాటిని కూడా అమలు చేస్తామని ఆమె చెప్పారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో కమీషన్ల కోసం కక్కుర్తిపడి రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు.