వేసవిలో గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:40 AM
రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క హితవు చెప్పారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు:సీతక్క
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క హితవు చెప్పారు. ప్రతి రోజూ మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ బయటకు రావద్దన్నారు. ప్రజా భవన్‌లో మంత్రి సీతక్క మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజారోగ్యం ముఖ్యమన్నారు. అత్యవసర పనులు ఉంటే ఉదయం 6-10 గంటల మధ్య పూర్తి చేసుకుని, మిగతా సమయాల్లో ఇంటి వద్దే ఉంటే మంచిదన్నారు. ఎండ తీవ్రత లేని సమయాల్లో పనులు చేయాలని, అవసరమైతే తగిన జాగ్రత్తలతో మాత్రమే పని చేయాలని సీతక్క సూచించారు.