Share News

వైభవంగా సీతారాముల కళ్యాణం

ABN , Publish Date - Mar 27 , 2026 | 10:57 PM

పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్ర వారం సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది.

 వైభవంగా సీతారాముల కళ్యాణం
మందమర్రి మూడవ జోన్‌లో పట్టు వస్ర్తాలను పట్టుకుని వస్తున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి దంపతులు

-హాజరైన మంత్రి వివేక్‌వెంకటస్వామి దంపతులు, జిల్లా కలెక్టర్‌

-పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి దంపతులు

మందమర్రిటౌన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్ర వారం సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. పలు ఆలయాల్లో వేద పండితుల వేదమంత్రోచ్ఛారణలతో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. మూడవ జోన్‌ లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన కల్యాణానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి సరోజ దంపతులు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు, కేకే 5 గని మేనేజర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ శంభునాధ్‌పాండే దంపతులు, ఏఐ టీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ దంపతులు, పిట్‌ కార్యదర్శి గాండ్ల సంపత్‌ దంపతులు హాజరయ్యారు. మంత్రి దంపతులు స్వామి వారికి పట్టు వస్ర్తాలను సమ ర్పించారు. పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి దంపతులు కల్యాణానికి ప ట్టు వస్ర్తాలు సమర్పించారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ కూడా కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్యాణం అనంతరం ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయాల వద్ద సీఐ రమేష్‌, ఎస్‌ఐ నరేష్‌ల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మందమర్రి మున్సిపల్‌ కమీషనర్‌ రాజలింగు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 10:58 PM