ఫోన్ ట్యాపింగ్ కేసులో కవిత వ్యక్తిగత సహాయకుడి వాంగ్మూలం నమోదు
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:04 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత వ్యక్తిగత సహాయకుడి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు బుధవారం నమోదు చేశారు
హైదరాబాద్,జూన్17(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత వ్యక్తిగత సహాయకుడి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు బుధవారం నమోదు చేశారు. నాటి బీఆర్‌ఎస్ హయాం నుంచి కవిత వద్ద పనిచేస్తున్న శ్రీకాంత్ ఫోన్‌ను మావోయిస్టుల కోటాలో ట్యాపింగ్ చేశారని గుర్తించిన సిట్ అధికారులు ఆ విషయాన్ని అతనికి వివరించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారులు నమోదు చేశారు.